జగన్‌కు ‘కమ్మ’ని షాక్..సొంత నేతలే రివర్స్..!

గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు మెజారిటీ సంఖ్యలో జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అందులో టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే కమ్మ వర్గం సైతం..వైసీపీ వైపుకు వెళ్లింది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం డామినేషన ఉన్న సీట్లలో వైసీపీ గెలిచిందంటే..కమ్మ వర్గం సపోర్ట్ జగన్‌కు దక్కిందనే చెప్పొచ్చు.

మరి అలా సపోర్ట్‌గా ఉన్న కమ్మ వర్గాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతుందనేది కూడా నిజమే. ఆ విషయం రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. చంద్రబాబు కమ్మ వర్గం అవ్వడం వల్ల…టోటల్‌గా కమ్మ వర్గమే శత్రువులుగా భావిస్తున్నారు. చంద్రబాబుతో సహ కమ్మ వర్గంట్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు. అన్నీ రకాలుగా చుక్కలు చూపిస్తున్నారు. అసలు కమ్మ వర్గం అంటే వైసీపీకి శత్రువు అన్నట్లు అయిపోయింది. ఆ విధంగా వైసీపీ పాలన నడుస్తుందని చెప్పొచ్చు.

అయితే వైసీపీలో కూడా కమ్మ నేతలు ఉన్నారు..ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ వారు కూడా లోలోపల జగన్ రాజకీయం పట్ల అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. కానీ అధికారంలో ఉండటంతో పైకి ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం లేదు. పైగా కొడాలి నాని,వల్లభనేని వంశీ లాంటి వారే చంద్రబాబుని బూతులు తిడుతున్నారు. దీంతో వైసీపీలో ఉండే మిగిలిన కమ్మ నేతలు సైలెంట్ గానే ఉండిపోతున్నారు.

కానీ తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు..ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంపై..తాజాగా జగ్గయ్యపేటలో జరిగిన కమ్మ వన సమారాధన కార్యక్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వసంత నాగేశ్వరరావు..మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి అనే సంగతి అందరికీ తెలిసిందే.

అలా వైసీపీ వైపు ఉన్న వసంత..ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా పేర్లు మార్చలేదని,  రాష్ట్రంలో నేడు కమ్మ సామాజిక వర్గంపై దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్థం కావటం లేదని, గత ఎన్నికల్లో 35 శాతం కమ్మ వర్గం జగన్‌ని సీఎం చేయడానికి కష్టపడిందని, కానీ జగన్ అదే కమ్మ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనే విధంగా వసంత మాట్లాడారు. మనకంటే పక్క రాష్ట్రంలోని అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి వైసీపీలో ఉండే కమ్మ వర్గంలో కూడా మార్పు కనిపిస్తోంది.

Share post:

Latest