ప్రస్తుత పాలిటిక్స్ పై ధ్వజమెత్తిన బండ్ల గణేష్‌.. ఆ రొచ్చులో దిగకపోవడమే బెటర్!

టాలీవుడ్ నటుడు, సినిమా నిర్మాత బండ్ల గణేష్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. బండ్ల గణేష్‌ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అది ఒక సెన్షేషన్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. పాలిటిక్స్ లోకి రావడం వలన చాలా నష్టపోయానని, ఇంట్రెస్ట్ లేనిదే ఎవరు రాకూడదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్‌ కోసం ఆయన ఓ టీవీ డిబేట్‌లో వాదించిన వీడియోని షేర్‌ చేశారు. అందులో ఎమ్మెల్యేగా ఉన్న రోజాతో బండ్ల గణేష్‌ టీవీ డిబేట్‌ విషయాన్ని మనం గమనించవచ్చు.

ఈ పాత వీడియోని మీరు గమనించినట్లయితే రోజా, బండ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకోవడం మనకు తెలిసినదే. పళ్లు రాలిపోతాయని రోజా విమర్శలు చేయగా, దానికి బండ్ల గణేష్‌ కూడా ధీటుగా నీ పదహారు పళ్లు కూడా రాలిపోతాయి అని మాట్లాడాడు. దానికి రోజా ఏ మాట్లాడుతున్నావ్‌ రా వెదవ, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. అని అనగా… MLAగా ఉండి నువ్వు ఇలా బజారుదానిలా మాట్లాడితే నేనేం చేసేది? అంటూ తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు బండ్లగణేష్‌.

అయితే తాజాగా ఈ వీడియోని ఓ అభిమాని షేర్‌ చేస్తూ రోజాకి మన బండ్ల అన్నగారే కరెక్ట్ అని కామెంట్ చేయడం విశేషం. మళ్లీ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పోస్ట్ పెట్టగా, దీనికి బండ్ల గణేష్‌ రియాక్ట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయాల వల్ల చాలా నష్టపోయానని తెలిపారు. ప్రస్తుతం తనకి ఏ రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. దానికి జనసేన అభిమానులు సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ని మరలా రాజకీయాల్లోకి రావాలని, జనసేనానితో కలిసి నడవాలని కోరారు.