ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో సంకీర్తన, కీచురాళ్ళు, కోకిల వంటి సినిమాలను తెరకెక్కించి.. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకోక పలు ఇంటర్వ్యూలు ఇస్తూ స్టార్ హీరోలపై తనదైన స్టైల్ లో రకరకాలుగా మాట్లాడుతూ.. అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ సంచలన కామెంట్లు చేయడంతో ప్రభాస్ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు.
గీతాకృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ప్రభాస్ యంగ్ కుర్రాడని.. ఆయన కూడా విగ్గు పెట్టుకోడు అంటూ గీతాకృష్ణ తెలిపారు. అయితే ప్రభాస్ తన బాడీ కటౌట్ , తన హేర్ అంత చాలా బాగుంటుంది. చూడడానికి కూడా బాగా ఉంటాడు. ఇలా ప్రభాస్ ఎంతో ఎత్తు పెరిగాడు. కానీ ఆయనకు సరైన బుర్ర లేదు.. అంటూ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.. అంతేకాదు ప్రభాస్ కి బుర్ర లేకపోవడంతో ఎలాంటి సబ్జెక్టు చేయాలనే విషయం కూడా అతడికి తెలియడం లేదు అంటూ మరింత సంచలనంగా మాట్లాడడం జరిగింది. దీంతో ప్రభాస్ అభిమానులు గీతాకృష్ణపై పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆది పురుష్, ప్రాజెక్టుకే, సలార్ వంటి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సంక్రాంతి పండుగకు ఆది పురుష్ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొంచెం వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల సినిమాను వచ్చే ఏడాది జూన్ నెలకు వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత సలార్, ప్రాజెక్టుకే వంటి సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.