నటి సోనమ్ కపూర్ హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి!

బాలీవుడ్ మెరుపుతీగ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరో అనిల్ కపూర్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, అయితేనేం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ అందరిలా పెళ్లి విషయంలో లేట్ చేయలేదు. సినిమాలు చేస్తున్నప్పుడే వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లాడింది. ఈ క్రమంలో పండంటి మగ బిడ్డ ‘వాయు’కి జన్మనిచ్చింది.

బేసిగ్గా బాలీవుడ్ నటీనటులు ఎక్కువగా బ్రాండెడ్ వస్తువుల్ని మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే అవి వారి స్టేటస్ ని వెలికి చూపించేవిగా ఉంటాయి కనుక. షూ నుండి గ్లాసెస్ వరకు ఇలా ఏది చూసిన వాటి ధర వేలల్లో కాదు.. లక్షల్లో ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? ఇటీవలే డెలివరీ తర్వాత సోనమ్‌ ఎయిర్‌పోర్టులో సింగిల్‌గా కనిపించింది. ఈ సందర్భంగా సోనమ్ కపూర్ స్టైలిష్ లుక్‌లో మెరిసింది. ఢిల్లీలో జరిగిన స్టోర్ లాంచ్ ఈవెంట్‌కు సోనమ్, ఆనంద్‌లను ఆహ్వానించగా ఈ కార్యక్రమానికి దంపతులు వెళ్లారు.

ఈ సందర్భంగా సోనమ్ క్యారీ చేసిన “హ్యాండ్ బ్యాగ్” ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. లేత గోధుమరంగు మరియు నలుపు రంగు కాన్వాస్ ట్రావెల్ బ్యాగ్‌ని కేరీ చేసింది. చూడటానికి కాస్త పెద్ద బ్యాగ్ లా కనిపించింది. ఈ బ్యాగ్ అసలు ధర అడిగితే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే మీరు ఈ బ్యాగ్ కొనాలంటే మీమీ ఆస్తులు అమ్ముకోవలసిందే. ఈ బ్యాగ్ హెర్మేస్ బ్రాండ్ ద్వారా తయారు చేయబడింది. ఈ బ్యాగ్ ధర 14,700 US డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 12,00,438 రూపాయలు అన్నమాట.