థండ‌ర్ థైస్‌తో `ఆదిపురుష్‌` బ్యూటీ ద‌డ‌ద‌డ‌లు.. వామ్మో ఏంటీ అరాచ‌కం?

కృతి సనన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వాస్తవానికి కృతి సనన్ తెలుగు సినిమాతోనే కెరీర్ ను ప్రారంభించింది.

మహేష్ బాబు హీరోగా వ‌చ్చిన‌`1 నేనొక్కడినే` మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన కృతి స‌న‌న్‌.. ఆ తర్వాత బాలీవుడ్ కి మ‌కాం మార్చి అక్కడ అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ.. చాలా కాలం తర్వాత `ఆదిపురుష్‌` సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను పలకరించేందుకు సిద్ధమయింది.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి స‌న‌న్ కనిపించబోతున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలవల్ల జూన్ 16కు రిలీజ్ ను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. కృతి సనన్‌ తాజా ఫోటోషూట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కృతి స‌న‌న్‌కు అందాల‌ను ఆర‌బోయడం కొత్తేమీ కాదు.

కానీ ఈసారి మ‌రింత హాట్ గా దర్శనమిచ్చింది. మోకాళ్ళ పైకి ఉండే ట్రెండీ కట్స్ డ్రెస్ ధరించిన కృతి సనన్.. థండర్ థైస్ తో దడదడలాడించింది. అలాగే మరోవైపు ఎద అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన నెటిజ‌న్లు మరియు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక కుర్ర కారు అయితే కృతి అందాల అరాచకానికి పిచ్చెక్కిపోతున్నారు.

Share post:

Latest