మొదటిసారి నాని నటించిన” మజ్ను” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అందం అను ఇమ్మానుయేల్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది ఈ ముద్దుగుమ్మ . గ్లామర్ పరంగా యువతను ఆకర్షించడంతో వరుసగా అవకాశాలు అందుకుంది. అలా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న “అజ్ఞాతవాసి” చిత్రం మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రంలో నటించింది. అయితే ఇది కూడా నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. ఇలా రెండు భారీ చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఈమె ఆశలు మొత్తం అడియాశలు అయ్యాయి.
దీంతో తమిళనాడుకు చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా ఒకటి రెండు చిత్రాలలో నటించి పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో అక్కడే తమిళ దర్శకుడితో ప్రేమలో పడి చట్టపట్టలేసుకొని తిరిగింది. అయితే అది బ్రేకప్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ తెలుగులో అల్లు శిరీష్ సరసన ఊర్వశివో రాక్షసివో అని సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం దగ్గర నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ కూడా ఇదే ప్రశ్న అడగగా.. అలాంటిదేమీ లేదు స్నేహితులము మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది అను ఇమ్మానియేల్.
ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ కి జోడిగా ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించిన ఈమె ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ అందుకున్న ఈమె నాజూకైన నడుముతో మరింతగా గ్లామర్ విందు చేస్తోంది. ఈ క్రమంలోని తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ .. చీర కట్టు అందాలతో యువతకు చుక్కలు చూపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ఫిదా అవ్వకుండా ఎవరూ ఉండరేమో.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram