ఇంతవరకు సినీ హీరోయిన్స్ క్రికెటర్స్ ప్రేమలో పడటం చూశాం. అయితే కానీ గత కొంతకాలంగా క్రికెటర్స్ తమ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ధోని, అజారుద్దీన్, మిథాలీ రాజ్ వంటి లెజెండ్రీ క్రికెటర్స్ బయోపిక్ లు తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. శ్రీకాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత్ క్రికెటర్స్ కొందరు సౌత్ సినిమాలలో కనిపించారు.. ఆ స్టార్ క్రికెటర్లు కనిపించిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
8 మంది స్టార్ క్రికెటర్లు ఒకే సినిమాలో:
నవ్‌జోత్ సింగ్ సిద్ధు , మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, కపిల్ దేవ్, ఆశిష్ నెహ్రా, శ్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. లాంటి ఇండియన్ స్టార్ క్రికెటర్స్ అందరూ కలిపి వాళ్ళ రియల్ క్యారెక్టర్ తో ఓ బాలీవుడ్ సినిమాలో నటించారు.. ఆ సినిమా ఏమిటంటే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 2004లో వచ్చిన ‘ముఝ్సే షాదీ కరోగి’ సినిమాలో వీరందరూ కనిపించారు.
యోగ్ రాజ్ సింగ్( యువరాజ్ సింగ్ తండ్రి):
ఇండియన్ స్టార్ క్రికెటర్లో ఒకరైన యువరాజ్ సింగ్.. తండ్రి కూడా పంజాబీ చిత్ర పరిశ్రమలో స్టార్ నటుడుగా కొనసాగుతున్నారు. యోగ్రాజ్ సింగ్ యాక్టర్ అనే విషయం పెద్దగా తెలియదు కానీ 2011 వరల్డ్ కప్ తర్వాత తన కొడుకు కెరియర్ నాశనం అవటానికి ధోని కారణమంటూ కామెంట్స్ చేసి వార్తల్లో కనిపించారు. ఈయన లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో ఓ కీలకపాత్రలోో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
హర్భజన్ సింగ్:
ఇండియన్ స్టార్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా క్రికెట్ తో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఏమిటంటే.. ‘ముఝ్సే షాదీ కరోగి’ తర్వాత ‘భాజీ ఇన్ ప్రాబ్లమ్’ అనే పంజాబీ, ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్’ (హిందీ), ‘డిక్కీలోనా’ అనే తమిళ్ మూవీస్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. మొదటిసారిగా తను హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే తమిళ్ సినిమా చేశాడు.. సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో బజ్జీ తన నటనతో అందరిని మెప్పించాడు.
ఎస్. శ్రీశాంత:
ఇండియా ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ శ్రీకాంత్.. ఇండియన్ క్రికెట్ లోనే మ్యాచ్ ఫిక్సింగ్ తో వార్తల్లో నిలిచిన శ్రీకాంత్ తర్వాత క్రికెట్‌కు దూరమయ్యాడు అప్పటి నుంచి ఆయన పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ నటించిన కొన్ని సినిమాలు ఇవే.. అక్సర్, క్యాబ్ రేట్, టీమ్ 5, కెంపెగౌడ2, కాతువాకుల రెండు కాదల్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇర్ఫాన్ పఠాన్:
ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తన క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్డ్ ఇచ్చిన తర్వాత రీసెంట్గా విక్రమ్ హీరోగా వచ్చిన కోబ్రా సినిమాలో ఓకీలక పాత్రలో నటించి అందర్నీ అలరించాడు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించి ఎంతో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఎంఎస్ ధోని:
ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని కూడా సిల్వర్ స్క్రీన్ మీద అల్లరించడానికి రెడీ అయ్యాడు. తన భార్య సాక్షితో కలిసి తన పేరుతో ధోని ప్రొడక్షన్ హౌస్ అనే బ్యానర్‌ను కూడా స్టార్ట్ చేశాడు.ఓ తమిళ్ సినిమాను కూడా ఈ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు. వీటితో పాటు ధోని ప్రధాన పాత్రలో ఓ యానిమేషన్ ఫిలింలో నటిస్తున్నాడు.