ధర్మవరంలో శ్రీరామ్..రాప్తాడులో సునీత..ఫిక్స్ చేసుకున్నారు!

పరిటాల ఫ్యామిలీ రెండు సీట్లు ఫిక్స్ చేసేసుకుంది…వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు స్థానాల బాధ్యతలని చంద్రబాబు..పరిటాల ఫ్యామిలికే అప్పగించారు. సీట్లు ఇంకా ఫిక్స్ చేయలేదు.  కానీ రెండు స్థానాల్లో అభ్యర్ధులు వారే అని దాదాపు టి‌డి‌పి శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే..ధర్మవరం, రాప్తాడు సీట్లలో మార్పులు ఉండవని అర్ధం అవుతుంది.

గత ఎన్నికల్లో రాప్తాడు సీటులో శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు..అటు ధర్మవరంలో పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. దీంతో ధర్మవరం బాధ్యతలు సైతం పరిటాల ఫ్యామిలీకె ఇచ్చారు. దీంతో ధర్మవరం శ్రీరామ్, రాప్తాడు సునీత తీసుకుంటున్నారు. వీరిద్దరు ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

రాప్తాడులో సునీతమ్మ రైతుల కోసం పాదయాత్ర కూడా చేస్తున్నారు. అటు ధర్మవరంలో శ్రీరామ్ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం లో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని, గ్రామాల్లో పార్టీ అభివృద్ధి, పటిష్టత, బలోపేతంపై గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో తాజాగా పరిటాలశ్రీరామ్‌ సమీక్షించారు. గ్రామాల్లో తిరుగుతూ, అక్కడ ఉండే సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు.

అయితే సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరంలో పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి గాని..ఎవరు వచ్చిన ఏదొక పదవి ఇస్తాం గాని..ధర్మవరంలో పోటీ చేసేది మాత్రం తానే అని శ్రీరామ్ ఇప్పటికే చెప్పేశారు. ఇక చంద్రబాబు సైతం..ధర్మవరం సీటు విషయంలో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. మొత్తానికి ధర్మవరంలో శ్రీరామ్, రాప్తాడులో సునీత పోటీ చేయడం దాదాపు ఫిక్స్ అని చెప్పొచ్చు.