ఆ స్టార్ హీరో కొడుకు లేచిపోయాడా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కొత్త రూమర్..!!

ఎస్ .. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇండస్ట్రీకి చెందిన బడా యాక్టర్ కొడుకు ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా సోషల్ మీడియాకు.. బయట ప్రపంచానికి కనిపించని ఈ యువ హీరో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అన్న న్యూస్ గత కొన్ని వారాల నుంచి వైరల్ గా మారింది. అయితే తాజాగా ఆ ఫ్యామిలీ సన్నిహితుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఆ హీరో కొడుకు ఎప్పుడో కొన్ని నెలల ముందే ఇంట్లో నుంచి లేచిపోయాడట .

తాను కాలేజీ చదువుకుంటున్న రోజుల్లోనే ఓ అమ్మాయి తో లవ్ లో పడ్డారని.. కానీ స్టార్ స్టేటస్ అంటూ ఆయన తండ్రి అడ్డుపడ్డాడని.. ఈ క్రమంలోని ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేక ఆ యంగ్ హీరో ఆ అమ్మాయితో లేచిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే తనదైన స్టైల్ లో వందలాది సినిమాలో నటించిన ఈ హీరో తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తనకంటూ స్పెషల్ ముద్ర వేయించుకున్నాడు . ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించే నటుడిగా ఎంతో మంది స్టార్స్ దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నాడు .

అంతే కాదు ఈయన కొడుకు సైతం ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేశాడు . అయితే ఏవి సక్సెస్ కాలేదు . ఈ క్రమంలోని తండ్రి సజీషన్ తో బాలీవుడ్ హీరో రేంజ్ లో ఉండే కటౌట్ తో అటువైపుగా అడుగులు వేయడానికి ట్రై చేసాడు . ఈ క్రమంలోనే అతగాడు బాలీవుడ్ లో కొన్ని అవకాశాలు అందుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇదిగో ఎంట్రీ అదిగో అఫిషీయల్ అనౌన్స్ మెంట్ అంటూ ఆశ పెడుతున్న ఇప్పటివరకు అభిమానులకు అప్డేట్ ఇవ్వకపోవడంతో అసలు విషయం ఆరా తీయగా.. అసలు ఆ హీరో కొడుకు ఇంట్లోనే లేడని ..లేచిపోయి ఆరు నెలలు పైనే అవుతుంది అని ..ఈ విషయం బయటకు వస్త్వ పరువు పోతుందని మేనేజ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ఉన్న ఒక్కగాని ఒక్క కొడుకు ఇలా లేచిపోవడంతో ఆ హీరో పరువు గంగలో కలిసిపోయింది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.