ఆ టాలీవుడ్ స్టార్ హీరోలు… ఇలియానాను అంత మాట అన్నారా..!

ఏ సినిమా పరిశ్రమలోనైనా కాస్టింగ్ కౌచ్ వివాదం సర్వసాధారణం అయిపోయింది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు… సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే దర్శక- నిర్మాతలు- స్టార్ హీరోలు చెప్పింది చేయాల్సిందే, అలా చేయకపోతే పరిశ్రమ నుండి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది…ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత త‌రంలో ఉన్న హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉన్నారు.

ఈ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఒకప్పుటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఎవరు ఊహించని కామెంట్లు చేసింది. ఆమె కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ హీరోగా వచ్చిన దేవదాస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలియానా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇలియానాకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. ఇలియానా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి… స్టార్ హీరోయిన్గా దశాబ్దం పాటు తన హవాను టాలీవుడ్ లో కొనసాగించింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఇలియానా టాలీవుడ్కు దూరమైంది. కొత్త హీరోయిన్లు రాకతో ఇలియానాకు అవకాశాలు తగ్గి సినిమాలుకు దూరమైంది. టాలీవుడ్‌లు అవకాశాలు లేకపోవడంతో ఇలియానా బాలీవుడ్లో తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇలియానా తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై తన మనసులో మాట బయటపెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా క్యాస్టింగ్ కౌచ్‌ బారిన పడినట్టు సంచలన కామెంట్లు చేసింది.

Ileana D'Cruz raises temperatures in a bikini photoshoot - View pics! -  Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at  Bollywoodlife.com

“టాలీవుడ్ లో నేను ఓ సినిమా చేసేటప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు నన్ను వారితో గడపమని చాలాసార్లు ఇబ్బందికి గురి చేశారని.. ఆమె చెప్పుకొచ్చింది. ఏ పరిశ్రమ లోనైనా అవకాశాలు రావాలంటే దర్శక- నిర్మాతలు- స్టార్ హీరోలు కోరికలుతీర్చకపోతే అవకాశాలు రావని” ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. “తనను అలా రమ్మన్నారని చెప్పిన ఇలియానా తర్వాత మాట మార్చి తన స్నేహితురాలకు జరిగిన అనుభవం నాతో చెప్పిందని దానికి సంబంధించి ఏదైనా సలహా ఇవ్వమని నన్ను అడిగిందని ఇలియానా హాట్ కామెంట్స్ చేసింది”. ఇప్పుడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.