టీజర్: ధమాకా చిత్రం టీజర్ తో అదరగొడుతున్న రవితేజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించారు హీరో రవితేజ. క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాలేదు. అయినా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ధమాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ .ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Ravi Teja's Dhamaka Teaser: Mass Cracker
రవితేజ హీరోగా, డైరెక్టర్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్లో ధమాకా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీలా నటిస్తోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ చాలా వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ మేకర్స్ దీపావళి సంబరాలను మొదలుపెట్టారని చెప్పవచ్చు. ఈ టీజర్ విషయానికి వస్తే ఈ టీజర్ల రవితేజ మరొకసారి డాష్ క్యారెక్టర్లు కనిపించబోతున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది.

మరొకసారి ఈ చిత్రంలో డ్యూయల్ షేడ్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు రవితేజ. ఈ చిత్రంలో రవితేజ చెప్పిన కొన్ని మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషులో చెప్పే డైలాగ్ అందరిని మెప్పించే లాగా కనిపిస్తోంది. ఈ టీచర్ హైలెట్ లో రవితేజని చాలా హైలెట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటుడు జయరామ్, సత్యం రాజేష్ నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీజర్ నుంచి వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతోనైనా రవితేజ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ గా మారుతుంది.