చుట్టూ వాళ్ళుంటే హాట్ బాంబ్ సన్నీలియోన్ ఆ పని అస్సలు చేయదట!

సన్నీలియోన్..  బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా `జిన్నా` సినిమాలో సన్నీలియోన్ నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. గతంలో కరెంట్ తీగ, గరుడవేగ సినిమాలతో తన టాలెంట్, గ్లామర్ తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సన్నిలియోన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంతే సందడి చేస్తుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్స్ చేస్తుంది.

ఇటీవల సన్నీలియోన్ కన్నడ సినిమా `ఛాంపియన్ డింగార బిల్లే` అనే ఐటెం పాటకి స్టెప్పలేసింది. తాజాగా సన్నీలియోన్ తన ఐటమ్ సాంగ్స్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వెల్లడించింది. అదేమిటంటే.. హాట్ బాంబ్ సన్నీలియోన్ చుట్టుపక్కల పిల్లలు ఉంటే ఐటమ్ సాంగ్ అస్సలు చేయడట. ఎందుకంటే ఐటెం సాంగ్ అంటే కచ్చితంగా అడల్ట్ సీన్స్ ఉంటాయని.. ఆ సందర్భంలో చుట్టూ పిల్లలు ఉంటే సన్నీలియోన్ షూటింగ్ స్వయంగా తానే ఆపేస్తుందట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సన్నీలియోన్ అతిత్వరలోనే `జిన్నా` సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనున్న‌ది.