“కలర్ ఫోటో” సినిమా ని రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఈమె ..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ కథను రాసుకున్నాక హీరోయిన్గా ఒకరిని అనుకుని మరొక హీరోయిన్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్. 2020 అక్టోబర్ 23న ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది కలర్ ఫోటో.

ఈ సినిమా ద్వారా సుహాస్ తొలిసారిగా హీరోగా నటించాడు . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా చాందిని చౌదరి అదరగొట్టేసింది. సునీల్ , వైవ హర్ష , కంచరపాలెం సుబ్బారావు తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించారు. ఓవర్ ఆల్ గా ఈ సినిమా క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ గా మిగిలిపోయింది . మరీ ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హీరోయిన్ చాందిని చౌదరిని ఓ రేంజ్ లో పొగిడేసారు . అయితే నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్గా అనుకునింది రష్మిక మందన్న నట.

కానీ అప్పటికే ఆమె సరిలేరు నీకెవ్వరు అనే సినిమా హిట్ కొట్టి ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది . ఆ టైంలో ఈ సినిమా బడ్జెట్ తక్కువ కావడం ..సినిమాలో హీరోయిన్గా నటించడానికి భారీ రెమ్యూనరేషన్ అడగడంతో దర్శకనిర్మాతలు ఆమెను భరించలేక నో చెప్పారట . అలా రష్మిక మందన వదులుకున్న ఆఫర్ ను చాందిని చౌదరి కొట్టేసింది . చాందిని చౌదరికి ఈ సినిమా ఎంత సక్సెస్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ సినిమా నే చాందిని చౌదరి పేరు జనాలకు గుర్తుండిపోయేలా చేసింది. ఆ తర్వాత చాందిని చౌదరి మంచి మంచి సినిమాలను తన ఖాతాలో వేసుకున్నింది. ఏది ఏమైనా సరే రష్మిక మందన చేసిన ఓ చిన్న మిస్టేక్ తన కెరీర్ లో వన్ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకునేలా చేసింది.