యాంకర్ శ్రీముఖిని కూడా వదల్లేదట… సినిమా కావాలంటే పక్కలోకి రమ్మన్నాడట!

బుల్లితెర బబ్లీ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మనకున్న యాంకర్లలో ఈమె ఒకరు. ఆ తరువాత బిగ్ బాస్ షో పుణ్యమాని అమ్మడు మంచి పాపులారిటీని సంపాదించింది. ఇకపోతే సినిమా ప్రపంచమంటేనే రంగులమయం. బయటకి చూడటానికి అలా వున్నా, ముఖ్యంగా అమ్మాయిలకు అదొక ముళ్లబాట వంటిది. ఒక్క సినిమా అవకాశం కోసం వారు మానాన్ని కోల్పోవలసి ఉంటుంది. అవును, శ్రీముఖి కూడా కెరీర్ బిగినింగ్ సినిమా అవకాశాలకోసం కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందట.

కాగా ఈ విషయాన్ని తాజాగా ఓ మీడియా వేదికగా శ్రీముఖి పంచుకుంది. శ్రీముఖి బేసిగ్గా చాలా మందికి యాంకర్ గానే తెలుసు. కాని ఆమె ముందుగా సినిమా అవకాశాలకోసం తిరిగింది. ఈ క్రమంలో వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. అవకాశాలు రాకపోవడంతో బుల్లి తెరకు షిప్ట్ అయ్యింది. మొదట్లో జులాయి, నేను శైలజా లాంటి సినిమాల్లో నటించి మెప్పంచింది శ్రీముఖి. శ్రీముఖి సినిమాల్లో హీరోయిన్ గా ఎదగాలని ఆశపడి వచ్చింది. కాని ఆమెకు హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు మాత్రమే వరించాయి.

ఇదే క్రమంలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకుందట. కెరియర్ స్టార్టింగ్ రోజుల్లో.. సినిమా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ డైరెక్టర్ ను ఆమె కలిసిందట. ఆమె అందానికి ముగ్ఢుడైన సదరు దర్శకుడు ఆమెను కమిట్మెంట్ ఇవ్వమని అడిగాడట. అంటే తన కోరిక తీర్చడానికి బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. అయితే దానికి ససేమిరా అన్న శ్రీముఖి ఆ తరువాత సినిమా అవకాశాలు రాకపోవడంతో సినిమాలు వదిలేసి టీవి రంగంలోకి అడుగు పెట్టిందట. అయితే సినిమా రంగంపై ప్రేమ చంపుకోలేక శ్రీముఖి అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే ఉంది కానీ కధానాయిక పాత్రలు మాత్రం ఆమెని వరించలేదు.