ఈ గోవా బ్యూటీ.. బికినీ ట్రీట్లతోనే చంపేస్తోందిగా..!!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ కెరియర్ తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా మరొకసారి తన బికినీ ట్రీట్ తో ఆడియన్స్ ను రెచ్చగొట్టింది ఈ ముద్దుగుమ్మ . కొన్ని సంవత్సరాలు పాటు సౌత్ లో వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ రేంజ్ కి వెళ్ళిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగు, తమిళ్లో సూపర్ ఫామ్ లో ఉన్న సమయంలో అక్కడ ఆఫర్లు కాదని బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు.. అక్కడ కూడా ఫ్లాప్ అవడంతో తిరిగి సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా..మేకర్స్ పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో వచ్చిన ఇలియానా అది ప్లాప్ అయ్యేసరికి మరో ఛాన్స్ అందుకోలేదు.

తాజాగా వైట్ కలర్ బికినీ ధరించి తన ఫ్రెండ్ తో ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. టు పీస్ బికినీలో ఇంత క్లీన్ అండ్ క్లియర్ కట్ చూపించే అమ్మడు ఇలియానా మాత్రమే అని చెప్పవచ్చు. ఎలాగో అవకాశాలు లేవు.. గ్లామర్ షో తో అయినా తన ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు 2019లో పాగల్ బంతి సినిమాలో నటించినది. 2021 లో బిగ్ బుల్ సినిమాలో కూడా నటించిన ఇలియానా ప్రస్తుతం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ సినిమాలో కూడా నటించింది. ఇలా బికినీ షూట్లతో ఎన్ని హోయలు పోయినా తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు.

ఇక కనీసం స్పెషల్ సాంగ్స్ కోసమైనా ఇలియానాకు చాన్స్ ఇస్తే తప్పకుండా ఇలియానా తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తుంది అని అభిమానులు కోరుకుంటున్నారు . మరి ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.