ఎంత ట్రై చేస్తున్న దాని పెంచలేకపోతున్న స్టార్ డాటర్..రీజన్ అదేనా..?

శివాత్మిక రాజశేఖర్.. రాజశేఖర్ జీవిత వారసురాలిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `దొరసాని` సినిమా తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే మొదటి సినిమా అంత హిట్ అందుకో లేకపోయినా హీరోయిన్గా మాత్రం శివాత్మికాకి మంచి మార్కులు పడ్డాయి.

దొరసాని సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ శివాత్మిక మరో సినిమా విడుదల కాలేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నప్పటికీ.. శివాత్మిక ఎంత ట్రై చేస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెంచలేకపోతుంది. స్టార్ యాక్టర్స్ డాటర్ అయినప్పటికీ శివాత్మిక మంచి అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. ఎంత ప్ర‌య‌త్నం చేస్తున్నప్పటికీ మంచి అవకాశాలైతే ఈమెకు తలుపు తట్టడం లేదు. టైర్ టూ హీరోలు కూడా ఈమెను పట్టించుకోవడం లేదు.

మరోవైపు శివాత్మిక సోషల్ మీడియా వేదికగా ఆమె హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్ కృష్ణ వంశీ చాలా కాలం నుండి తరికెక్కిస్తున్న రంగమార్తాండ , అలాగే పంచతంత్ర సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.