సమంత యశోద సినిమా వచ్చేదప్పుడే..!

తెలుగు హీరోయిన్లలలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు. సమంత ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా నాగచైతన్యత విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి బిజీగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద చిత్రం శ్రీదేవి మూవీస్ పతాకం పైన శివలింగ శ్రీకృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు

చూస్తున్నారు ఎందుకంటే సమంత సినిమా విడుదల కాక ఇప్పటికి కొన్ని సంవత్సరాలు కావస్తోంది.Yashoda release | സാമന്തയും ഉണ്ണി മുകുന്ദനും വേഷമിടുന്ന 'യശോദ' നവംബറിൽ  കാണാം; റിലീസ് തിയതി പ്രഖ്യാപിച്ചു | Release date for Samantha Unni Mukundan  movie Yasoda – News18 Malayalam

సమంత నటించిన యశోద చిత్రం నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ వంటి భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక శ్రీకృష్ణ మాట్లాడుతూ.. ఇదొక న్యూ ఇయర్స్ త్రిల్లర్ సాధారణంగా త్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అలాగే మహిళల ప్రేక్షకులకు ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయని తెలియజేశారు. విభిన్నమైన కథతో రూపొందించిన ఈ సీట్ ఎడ్జ్ త్రిల్లర్ యశోద టైటిల్ పాత్రలో సమంత చాలా అద్భుతంగా నటించిందని తెలియజేశారు శివలంకె కృష్ణ.

ఇక సమంత నటిస్తున్న ఖుషి, శాకుంతలం వంటి చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇక సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేకపోవడంతో ఆమె పైన పలు వదంతులు కూడా వస్తూనే ఉన్నాయి. అయినా కూడా సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అలాగే క్రేజ్ కూడా అమాంతం పెరుగుతూనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యశోద సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు సమంత అభిమానులు.