బుల్లితెరపై పలు రియాల్టీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీస్ సైతం పాల్గొంటూ ఉంటారు. మరికొంతమంది ఈ షోలో పాల్గొన్న తర్వాతనే సెలబ్రిటీ హోదాను సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి బిగ్ బాస్ షో పై పెద్దగా ఆసక్తి చేపడం లేదు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గెటప్ శ్రీను. తాజాగా బిగ్ బాస్ షో గురించి పలు షాకింగ్ కామెంట్లు చేయక ప్రస్తుతం ఆ కామెంట్స్ కాస్త వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
గెటప్ శ్రీను మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో లో పాల్గొనే ఆఫర్ వచ్చిన నేను వెళ్లలేదని తెలియజేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో పాటు, జబర్దస్త్ తోనే చాలా బిజీగా ఉన్నారు గెటప్ శ్రీను. ఆ రీజన్ వల్లే బిగ్ బాస్ షో కి వెళ్లడానికి తను అంతగా ఆసక్తి చూపలేదని తెలియజేయడం జరిగింది. ఆఫర్లు లేకుండా ఖాళీగా ఉంటే బిగ్ బాస్ షోకు వెళ్లే వాడినని తెలియజేయడం జరిగింది. ఆ షోలో పాల్గొనడం వల్ల మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని కామెంట్లు చేయడం జరిగింది. అలాగే మన ఎమోషన్స్ కూడా బయటపడతాయని తెలియజేశారు.
ఇక అంతే కాకుండా మన వ్యక్తిగత విషయాలు ప్రేక్షకులకు తెలియకుండా ఉంటేనే మనం స్క్రీన్ పైన బాగా యాక్టింగ్ చేయగలడానికి సాధ్యమవుతుందని గెటప్ శ్రీను తెలిపారు. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చిన కూడా ఈ షోకు వెళ్లకపోవడానికి కారణం ఇదే అని తెలిసిన నేటిజెన్లు సైతం అవాక్కయ్యారు. గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రియంట్రీ ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతున్నారు. అంతేకాకుండా పలు చిత్రాలను నటిస్తూ బాగా సక్సెస్ అవుతున్నారు.