బావ బామ్మర్దుల పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రోజా..!!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ ఈ షో ఇప్పుడు రాజకీయాంగ పలు ప్రకంపనలు రేపుతోందని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సినీ ఇండస్ట్రీలో ఉండే వారిని మాత్రమే గెస్ట్ గా పిలిచి వారి గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అభిమానులకు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్ 2 కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను పిలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రిమ్మింగ్ మొదలు అయ్యింది. కాగా ఈ టాక్ షోలో ఉమ్మడి రాజకీయాలు.. 1995 లో జరిగిన రాజకీయ పరిణామాల పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడం జరిగింది.

Unstoppable 2 First Episode: Emotional and Entertaining

అదే విధంగా టిడిపి అధినేత 1995లో తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదు అంటూ బాలయ్య కూడా అందుకు వత్తాసు పలకడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు కూడా రేపుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ఏపీ మంత్రి నటి రోజా అన్ స్టాపబుల్ షో పైన స్పందించడం జరిగింది. ఈ షోని నేను ఈరోజు చూశాను బావ బామ్మర్దులు కల్లారపకుండా అన్ స్టాపబుల్ లో అబద్దాలు చెప్పడం జరిగిందని తెలియజేసింది రోజా. ఇక ఆరోజు అధికార దాహంతో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు చంద్రబాబు అని తెలియజేసింది.

Nandamuri Balakrishna's Unstoppable with NBK Season 2 teaser: Chandrababu  Naidu remembers his student days - Ironity
కానీ ఈ రోజు అమాయకపు మాటలు, మాయ మాటలు మాట్లాడుతున్నారని తెలియజేసింది రోజా. ఆరోజు మీరు కూడా మాతోనే ఉన్నారు నేను కాళ్లు పట్టుకున్న కూడా ఎన్టీఆర్ వినలేదని చెప్పి ప్రజలను పిచ్చోళ్ళు చేయాలని అనుకుంటున్నారా అంటే రోజా తెలియజేసింది. అయితే ప్రజలు మాత్రం ఈ విషయంపై ఫుల్ క్లారిటీతో ఉన్నారని తెలియజేస్తోంది వీరి మాటలను చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారని రోజా ఫైర్ అవుతోంది.