‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?

అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ సీజన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఇక ఈ విషయమై అధికారిక ప్రకటన ఏది రాలేదు కానీ పవన్ నిజంగానే ఈ షోలో పార్టిసిపేట్ చేస్తారని గాసిప్స్ రావడంతో ఓ వైపు బాలయ్య అభిమానులు.. మరోవైపు పీకే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ప్రశ్న బాలయ్య ముందు తలెత్తగా… నిర్వాహకులే అలాంటివి ఫైనల్ చేయాలని చెప్పుకొచ్చారు. ఆ నిర్వాహకులు ఎవరో కాదు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.

కాబట్టి ఈ షోకి పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈసారి అన్‌స్టాపబుల్ టాక్ షోలో పొలిటికల్ టచ్ వున్న మనుషులని పిలుస్తారని తెలుస్తోంది. టీడీపీ అధినేతను రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కోసం తీసుకురాగా, ఇక రెండో ఎపిసోడ్ కోసం కూడా మరో పొలిటికల్ గెస్ట్ రాబోతున్నారని సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోన్న ప్రచారం. ఇక ఆ పొలిటికల్ గెస్ట్ పవన్ కళ్యాణ్.. అంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబే, బాలయ్య ద్వారా ఈ స్కెచ్ వేశారన్నది వినబడుతోంది. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని కొద్ది రోజులు ఆగితే గాని అసలు విషయం బయటకి రాదు.