తప్పో ఒప్పో అదే చేస్తా..ఇష్టం లేకుండానే ఆ పనికి ఒప్పుకున్న నాగచైతన్య.. !?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్ట ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నాగేశ్వరరావు గారి తర్వాత ఆ పేరును కంటిన్యూ చేస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగార్జున. నాగేశ్వరరావు పేరుని ఏమాత్రం చెడగొట్టకుండా ఇంకా ఆ పేరును డబుల్ చేస్తూ ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు నాగార్జున . అయితే ఇప్పుడు నాగచైతన్య అఖిల్ టర్న్ స్టార్ట్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నాగచైతన్య అఖిల్ సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి అల్లాడిపోతున్నారు . నాగార్జున మాత్రం తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇప్పటికి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో మన్మధుడుగా దూసుకుపోతున్నాడు.

కాగా అక్కినేని నాగార్జున పెద్దకొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగచైతన్య కెరియర్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతే కాదు కధల ఎంపికల విషయంలో నాగచైతన్యకు అస్సలు అవగాహన ఉండదట . పెళ్లికి ముందు నాగార్జున హెల్ప్ చేసే వారిని.. పెళ్లి తర్వాత బాధ్యతలన్నీ సమంతానే చూసుకుందని ..గతంలో వార్తలు వినిపించాయి. అయితే విడాకుల తర్వాత మళ్లీ ఆ బాధ్యతలను నాగార్జుననే చూసుకుంటున్నాడట .

కాగా నాగచైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు సమంత నాగచైతన్య దగ్గర ఫోర్స్ చేసి మరి “దూత” అనే వెబ్ సిరీస్ అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేయిచ్చిందట . మనకు తెలిసిందే దూత వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. నిజానికి ఏ స్టార్ హీరో కొడుకు అయినా సరే హీరోగానే సినిమాలు చేయాలనుకుంటాడు నెగిటివ్ రోల్ రిజెక్ట్ చేస్తాడు. అయితే సమంత మాత్రం తెలివితేటలతో ఆలోచించి నటుడు అన్నాక న్నీ పాత్రలు చేయాలి అంతూ బలవంతంగా సంతకం చేయించిందట.

అయితే ఈ సిరీస్ పై సైన్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల సమంత నాగచైతన్య విడిపోయారు . ఆ టైంలో నాగచైతన్యకు దూత వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెడుతున్నాం అంటూ కాల్స్ వస్తే నాగార్జున ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోమని ఫోర్స్ చేశారట .”ముందు నుంచి చెబుతూనే ఉన్నాను నీకు ఇలాంటివి సెట్ కావు .. రిజెక్ట్ చేసేయ్ అగ్రిమెంట్ పేపర్స్ క్యాన్సిల్ చేస్తాను మేకర్స్ తో నేను మాట్లాడుతాను..” అంటూ మాట్లాడారట. కానీ నాగచైతన్య మాత్రం అందుకు ఒప్పుకోలేదట. “తప్పో ఒప్పో నేను అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేసేసాను ఇప్పుడు అది నా బాధ్యత నాకు నచ్చకపోయినా సరే ఆ పని నేను చేస్తే దూత సిరీస్ ను యాక్సెప్ట్ చేశాడట”. ఏది ఏమైనా నాగచైతన్య మనసు చాలా సున్నితత్వం కలది..ఇలాంటి మంచి అబ్బాయిని మిస్ చేసుకుని సమంత తప్పు చేసింది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

Share post:

Latest