పెళ్లికి ముందే హనీమూన్.. రష్మిక, విజయ్ అడ్డంగా దొరికిపోయారుగా..!?

ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందు హనీమూన్లు చాలా కామన్ అయిపోయాయి . డేటింగ్ పేరుతో నేటి కాలం యువత అన్ని హద్దులు దాటేస్తుంది. తీరా చేతులు కాలాక లబోధిబోమంటూ బాధపడుతుంది. అయితే ఇలా పెళ్లికి ముందే హద్దులు దాటుతున్న వారిలో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఉండే యంగ్ హీరోలు హీరోయిన్స్ ప్రేమ పేరుతో హద్దులు దాటేస్తున్నారు అంటూ సినీ ప్రముఖుల సైతం చెప్పుకొస్తున్నారు.

కాగా ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయినట్లు తెలుస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. మనకు తెలిసిందే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా “గీతా గోవిందం”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది .దీంతో ఈ జంత లవ్ చేసుకుంటుంది అని సినీ వర్గాలల్లో టాక్ నడిచింది. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ, రష్మిక ఎప్పటికప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తూనే ఉన్నారు.

ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కాంబోలో వచ్చిన మరో సినిమా “డియర్ కామ్రేడ్”. ఈ సినిమాలో ఇద్దరు కెమిస్ట్రీ ఎంత బాగా వర్క్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఏకంగా రష్మిక మందన విజయ్ కి లిప్ కిస్ కూడా ఇచ్చేసింది . నిజానికి ఇది గ్రాఫిక్ అంటూ చెప్పుకొచ్చిన అప్పట్లో మాత్రం నిజంగానే రష్మిక డైరెక్టుగా పెట్టింది అంటూ ఓ వార్త కూడా వినిపించింది. అంతేకాదు వీరిద్దరూ కలిసి డిన్నర్ డేట్ లోకి వెళ్ళడం ..పార్టీలకు వెళ్లడం తో ,, వీరిద్దరి ప్రేమ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్లు జనాలు నమ్మేశారు.


కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి పెళ్లికి ముందు ఓ రొమాంటిక్ టూర్ ప్లాన్ చేసుకున్నారట. ఇందులో భాగంగా ఇద్దరు మాల్దీవులకు వెళ్తున్నట్లు బాలీవుడ్ కథనాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమవడం.. ఆ కథనాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. అంతేకాదు వీరిద్దరు నిజంగానే పెళ్ళికి ముందు హనీమూన్ కంప్లీట్ చేసుకుంటున్నారా ..?అంటూ జనాలు షాక్ అవుతున్నారు. చూడాలి దీనిపై రష్మిక మందన ఎలా స్పందిస్తుందో ..?