ఆ సీక్వెల్ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వెయిటింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!

ప్రస్తుతం నార్త్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏంటో తెలుసా? అస్సలు గెస్ చేయాలేరు. తాజాగా వచ్చిన అమీర్ ఖాన్ ‘లాల్‌సింగ్‌ చద్దాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. కాబట్టి షారుక్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఆ సినిమా ఏమిటంటే అల్లు అర్జున్ పుష్ప 2. యస్..అండి నిజమే.. తాజాగా ఓర్‌మ్యాక్స్‌ మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం 2023లో బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ఇదే.

Pushpa 2 Makes Allu Arjun The 3rd Highest-Paid Indian Actor, Getting Same Salary Which Was Quoted By Salman Khan For Kisi Ka Bhai Kisi Ki Jaan?

గత సంవత్సరం విడుదలైన పుష్ప ది రైజ్.. సౌత్ భాషలలోనే కాకుండా నార్త్‌లో కూడా ఎవరు ఊహించని కని విని ఎరుగని విజయం అందుకుంది. ఈ సినిమాలో బన్నీ చెప్పే డైలాగ్స్ అతని మేనరిజమ్స్‌ అక్కడ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమాకు పార్ట్-2 ‘పుష్ప: ది రూల్‌ రాబోతుందని మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం మన తెలుగు ప్రేక్షకులతో పాటు.. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఓర్‌మ్యాక్స్ నివేదికలో వెల్లడించింది. మన పుష్ప 2 సినిమా తర్వాత షారుక్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్లేస్ లో కూడా షారుక్ ఖాన్ జవాన్- డంకీ చిత్రాలు ఉండటం గమనారం. తాజాగా పుష్ప2 సినిమా షూటింగ్ కూడా డైరెక్టర్ సుకుమార్ మొదలుపెట్టారు.. దీపావళి రోజున పుష్ప2 కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తారని తెలుస్తుంది.