గప్ చుప్ గా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. లేట్ గా మ్యాటర్ లీక్ చేసిన నటి!

నటి పూర్ణ.. `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి బహుభాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, తాజాగా అఖండ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరిస్తుంది.

అయితే తాజాగా పూర్ణ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రేమలో పడిందని.. మరియు త్వరలో పెళ్లికి సిద్ధమవుతుందని, ప్రచారం సామాజిక మధ్యమాలలో హల్ చల్ చేసింది. అయితే పూర్ణ ఇటీవల తనకు లవర్ ఉన్నాడన్న‌ విషయాన్ని ఇద్దరు క్లోజ్ గా దిగిన ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పూర్ణ ప్రియుడి పేరు అసీఫ్ అలీ.. ఈయ‌న దుబాయ్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారని.. మనస్పర్ధలు కారణంగా వీరి ప్రేమ బ్రేకప్ అయిందని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ విషయంపై స్పందిస్తూ..ఓ భేటీలో పాల్గొన్న‌ నటి పూర్ణ.. వారి నిశ్చితార్థం ఈ ఏడాది మే 31న జరిగిందని.. జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో పెళ్లి అత్యంత సన్నిహిత సమక్షంలో జరిగిందని పేర్కొంది. అయితే దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని.. దీంతో త్వరలోనే కేరళలో పెళ్లి రిసెప్షన్ నిర్వహించినట్లు ఎంతో ఆసక్తికరమైన విషయాలు పూర్ణ వెల్లడించింది. అయితే తన చిరకాల కోరిక అయినా ఓ నాట్య పాఠశాలను దుబాయిలో ప్రారంభించినట్లు కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్ణ గప్ చుప్ గా పెళ్లి చేసుకున్న మేటర్ ని లేటుగా లీక్ చేయడంతో అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ లీక్ చేసిన ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.