ఎన్టీఆర్ పద్ధతులు: అప్పుడు త్రివిక్రమ్ బలయ్యాడు… ఇప్పుడు కొరటాల ఇరుక్కుపోయాడు..!!

ఇటివల కాలంలో వస్తున్న సినిమాలకు గ్యారెంటీ ఉండటం లేదు. పాత రోజుల్లో సినిమా అనౌన్స్ అయిందంటే ఆ సినిమాను పూర్తయ్యే వరకు నిర్మాతలు దర్శకులు ఎంతో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించేవారు. సినిమా హిట్ ప్లాప్‌ల గురించి వారు పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో సినిమా కమిట్ అయ్యాక కూడా హీరోలకి కథ నచ్చకపోతే మధ్యలోనే సినిమా పక్కన పెట్టేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.

Exclusive: Trivikram patches up with Tarak

ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో రావాల్సిన సినిమా కథ నచ్చక మధ్యలోనే ఆగిపోయింది. సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ అభిమాను లు తీవ్రంగా హర్ట్ అయ్యారు. త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకుడు కథ ఎన్టీఆర్‌కు నచ్చక పోవటం ఏంటి.. ఇది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి ఎన్టీఆర్ తన సినిమాలు విషయంలో ఎంత క్లారిటీగా ఉంటున్నాడో మనకు తెలుస్తుందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేయబోయే తర‌వాత సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన తర్వాత సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో అనౌన్స్ చేయగా.. ఈ కాంబోపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Koratala using free time for NTR30

ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు గడుస్తున్నా సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలు అవ్వలేదు. సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ మేకర్స్ బయటికి ఇవ్వటం లేదు. సినిమా గురించి ఇప్పటివరకు చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ వాటిలో ఏ వార్త నిజం కాలేదు. సినిమాకు సంబంధించి హీరోయిన్ కూడా ఇప్పటివరకు సెట్ కాలేదు. కొరటాల ఇప్పటికి కూడా ఈ సినిమాకు సంబంధించిన స్కిప్ట్ వర్క్‌ పూర్తి చేస్తూనే ఉన్నాడట. తాజాగా వచ్చిన వార్త ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుంది అని తెలుస్తుంది.