NTR 30: క్రేజీ అప్డేట్… కొరటాల ఎన్టీఆర్ సినిమా ఆ సెట్ వర్క్ మొదలు.. ఆ స్టూడియోలోనే..!

ఎన్టీఆర్ కొరటాల సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్న ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ సినిమాకు సంబంధించిన‌ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ డైలాగ్ తో కొరటాల రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ తోనే ఎన్టీఆర్ 30వ‌ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్వచ్చాయి. ఈ సినిమాకు ముందు ఆచార్య సినిమా తీసి భారీ ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కొర‌టాల‌. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని తన ఏంటో నిరూపించుకోవాలని స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

NTR 30: Jr NTR and Koratala Siva's film announced ahead of the actor's  birthday. See motion poster – Hindisip

ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కి సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాదులోనే కొత్తగా మొదలుపెట్టిన అలు స్టూడియోస్ లో సెట్ వర్క్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ కూడా అక్కడే మొదలు పెడతారని తెలుస్తుంది.దీనిపై మరింత అప్డేట్ తెలియాల్సి ఉంది.. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.