పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ తెలిపిన జబర్దస్త్ కమెడియన్..!!

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో షకలక శంకర్ కూడా ఒకరు. అలా పాపులర్ వచ్చిన తర్వాత ఎన్నో చిత్రాలలో హీరోగా నటించారు. మరికొన్ని చిత్రాలలో కమెడియన్ గా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని షకలక శంకర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Shakalaka Shankar - Wikipedia
ఇక మెగా ఫ్యామిలీ అంటే షకలక శంకర్ కు చాలా పిచ్చి అభిమాని అని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో కూడా షకలక శంకర్ నటించారు. ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అంటే మీకు పీకలు కోసుకొనే అభిమానం ఉందా అనే ప్రశ్న ఎదురవగా.. షకలక శంకర్ చెప్పిన సమాధానానికి ఆ యాంకర్ ఒక్కసారిగా షాక్కు గురైంది. పవన్ కళ్యాణ్ కోసం ఎవరు పీకలు కోసేసుకోరు ఆయన మంచి మనషి ఉన్నతమైన వ్యక్తి కలవారు అని తెలియజేశారు. అలాంటి వ్యక్తిని అందరూ అభినందించాలి కానీ అభిమానం అనే పేరుతో పిచ్చి పనులు చేయకూడదని తెలియజేశారు.షకలక శంకర్.

Shakalaka Shankar About Pawan Kalyan | Pawan Kalyan Temple | Pawan Kalyan |  Comedian Wants To Build A Temple For Pawan Kalyan | Shakalaka Shankar Wants  To Build A Temple For Pawan Kalyan | - Filmibeat
ఒక వ్యక్తిని మనం అభిమానిస్తే ఆయనకి ఉన్న అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి అని తెలిపారు. ఆయన చేసే మంచి పనులు ఇన్స్పైర్ గా తీసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం అభిమానించే వ్యక్తిని దేవుడు లాగా చూడకూడదు అని తెలియజేశారు షకలక శంకర్. ప్రస్తుతం షకలక శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి దీంతో పవన్ కళ్యాణ్ కు షకలక శంకర్కు ఎక్కడో చెడింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.