డైరెక్టర్ బాబీ మెగా 154 ఇంటర్వెల్ బ్లాక్ లీక్ చేశాడా? ఏదో పొరపాటులో అలా!

తెలుగు తెర అద్భుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, దుమ్ము దులిపిన సంగతి విదితమే. మార్నింగ్ షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ముఖ్యంగా మెగాభిమానులు ఆనందంతో తనమునకలైపోతున్నారు. భారీ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా నిన్న శనివారం రోజు ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగాయి.

ఇకపోతే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి దర్శకుడు బాబీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆనందంలో అనుకోకుండా మెగా 154 మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ గురించి ఓ మ్యాటర్ లీక్ చేసేసాడు. కాగా గాడ్ ఫాదర్ ఇంటర్వెల్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా చిరంజీవి కళ్ళని వాడుకుని సెటిల్డ్ గా చూపిస్తూ అదరగొట్టేసారు కదా. ఆ సన్నివేశాన్ని ఉటంకిస్తూ ఆ సీన్ అద్భుతం అని చెబుతూనే, మెగా 154 సినిమాలో ఇంటర్వెల్ ఒక జాతర, కోలాహలం చూసినట్లు ఉంటుంది అని చెప్పకనే చెప్పేసాడు బాబీ.

కాగా ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి పండగకు పూనకాలు లోడింగ్ అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇకపోతే మెగా 154లో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకార యూనియన్ లీడర్ గా కనిపిస్తున్నారు. ఇక రవితేజ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇద్దరి మధ్య సీన్స్ ఓ రేంజ్ లో వుంటాయని టాక్.