గజిని సీక్వెల్ రాబోతుందా…? మురగదాస్ షాకింగ్ ట్విస్ట్… ఫుల్ డిసప్పాయింట్ లో సూర్య..!

కోలీవుడ్ స్టార్ట్ హీరో సూర్య హీరోగా క్రేజీ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గజిని… ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని మురగదాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య కూడా అంతే అద్భుతంగా నటించి సినిమాకి సక్సెస్ అవడానికి కారణమయ్యాడు.

Suriya To Collaborate With Kaithi Director Lokesh Kanagaraj - Filmibeat

ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. సినిమాని మరుగదాస్ మతిమరుపు కాన్సెప్ట్‌తో సూర్య క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విడుదలై 14 ఏళ్ళు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై కోలీవుడ్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

BREAKING: Ghajini 2 Set to Roll Soon | Suriya | Aamir Khan - YouTube

మురగదాస్ గజిని సీక్వెల్ కు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టిడని… ఈ సినిమా సగం స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించాలని మురగదాస్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మొదటి పార్ట్ లో హీరోగా నటించిన సూర్య ఈ సినిమాలో నటిస్తాడు అన్న ఆశలు అయితే జనాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సూర్య ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించాడు. మరి ఇలాంటి టైం లో రొమాన్స్ సినిమా పై సూర్య సైన్ చేస్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి చూడాలి సూర్య గజినీ సీక్వెల్ లో నటిస్తాడో లేదో…?