హవ్వ: కూతురు ట్రెండింగ్ పిక్ పై షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ బాలీవుడ్ లో ఇప్పటివరకు 80 సినిమాలకు పైగా నటించాడు. ఆయనకు బాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు . షారుక్ ఖాన్ ఢిల్లీలో మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో జన్మించాడు.

 Suhana Khan Daughter Photos Goes Viral In Social Media Details , Suhana Khan,-TeluguStop.com
ఆయన ఎంతో కష్టపడి బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమెకి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సుహానా సోషల్ మీడియాలోో ఎప్పటికప్పుడు తన అభిమానులతో తన విషయాలను పంచుకుంటూ.. హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా సుహానా చీరకట్టులో మెరవగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Bollywood, Suhana Khan-Movie

ఆ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తుంది. ఆ ఫోటోలలో ఉన్న సుహానాన్ని చూసి కుర్రకారు గుండెల్లో చెమటలు పడుతున్నాయి. ఆ ఫోటోలకు సోషల్ మీడియా నుంచి పాజిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే సుహానా ఫోటోలు చూసిన షారుక్ ఖాన్ ఎవరు ఊహించిన విధంగా స్పందించారు. షారుక్ ఖాన్ తన కామెంట్ లో..” ఈ చీర నువ్వే కట్టుకున్నావా..?” అంటూ అదిరిపోయే కామెంట్ పెట్టాడు. సుహ‌నా చీర క‌ట్టులో అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది . దీపావళి పండుగ సందర్భంగా తన కొత్త ఫోటోలను సుహానా సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు సుహానా ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.