రవితేజ రావణాసుర చిత్రం నుంచి దీపావళి సర్ ప్రైజ్..!!

హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా నటిస్తున్న ధమాకా చిత్రం తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఎంతోమంది ఎదురుచూస్తున్న రావణాసుర సినిమా కూడా విడుదల తేదీని దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ మరొకసారి మాస్ లుక్ లో కూడా కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇక సూపర్ సర్ ప్రైజ్ అన్నట్లుగా అభిమానులు ఈ ఫోటోను చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

రవితేజ కి జోడిగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారు అందులో ఫరియ అబ్దుల్లా కూడా కనిపించబోతోంది. ఈ చిత్రంతోనైనా ఈ ముద్దుగుమ్మ మరొకసారి బాగా ఆకట్టుకుంటుందేమో చూడాలి. మరొక హీరోయిన్ మేఘ ఆకాంక్ష, దక్ష వీరిద్దరూ రవితేజ కి జోడిగా ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. రవితేజ నటిస్తున్న అన్ని సినిమాలలో ఈ సినిమా పైన కాస్త ఆసక్తి పెంచేలా కనిపిస్తోందని అభిమానులు సైతం భావిస్తున్నారు.

Sushanth A on Twitter: "Into the World of DEMONS! 👺 Thank you for this  sizzling welcome as #RAM in #RAVANASURA 🔥 Mass Maharaja @RaviTeja_offl  Sir, @sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks 🎉🤗 Hope  you
ఇక ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నారని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తుంటే మనకి అర్థమవుతోంది. ఇక హీరో అక్కినేని సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతున్నారు ఈ సినిమా మరింత హైప్ నెలకొంది అని చెప్పవచ్చు. మరి రవితేజ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను అందుకుంటారేమో చూడాలి మరి.