యాక్టర్ దివి హాట్ ఫోటో షో చూస్తే మీకు మతి పోతుంది… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్!

నటి దివి గురించి ఈమధ్యన వినే వుంటారు. ఈమధ్య రిలీజై సూపర్ డూపర్ హిట్టైన గాడ్ ఫాదర్ సినిమాతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఆమె ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టిస్తున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన దివి.. ఇండస్ట్రీలో వుండే కమిట్‌మెంట్ గురించి తన అభిప్రాయాలను వెళ్లగక్కింది. ఆమె మాట్లాడుతూ.. కమిట్‌మెంట్ అనేది ఇక్కడ ఓపెన్ విషయమే. మమ్ముల్ని అడగలేదని ఎవరైనా అంటే అది పెద్ద జోక్. ఎవరైనా ఇష్టం ఉండి కమిట్ అయితే అది తన దృష్టిలో అది పెద్ద తప్పు కాదని చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దివి బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పేరు తెచ్చుకుంది. ఈమె అచ్చతెలుగు హైదరాబాదీ అందం. వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించిన దివి.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న భోళాశంకర్‌ సినిమాలో కూడా ఓ రోల్ లో మెరవనుంది. బోళాశంకర్ తమిళ హిట్ సినిమా వేదాళంకు రీమేక్’గా వస్తుందనే విషయం మీకు తెలిసినదే. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. అయితే దివి పాత్ర ఏమిటనేది మాత్రం ఇంకా తెలిసిరాలేదు.

బేసిగ్గా దివి MBA పూర్తి చేసిన తరువాత 2019లో “మహర్షి” సినిమాలో నటించింది. దాంతో పాటు సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో కూడా మెరిసింది. అయితే ఆమెకి ఆ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించడం వలన ఆమెకి కాస్త పేరు వచ్చింది. బిగ్ బాస్‌ సీజన్ 4 కూడా ఆమెకి అనూహ్యమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ 4 తెలుగులో మిగిలిన అమ్మాయిలున్నా కూడా దివి మాత్రం అందరి కంటే ఎక్కువగానే ఆకట్టుకుంది. అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌజ్‌లో కూర్చోబెట్టారు.