ప్ర‌గ‌తి ఆంటీ ఇంటిని చూశారా..? అదిరిపోయింది అంతే!

ఈ మధ్యకాలంలో చాలామంది ఇటు బుల్లితెర మరియు అటు వెండితెర సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టారు. వీడియో వ్యూస్ పెరగడం కోసం రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ డిఫరెంట్ వీడియోలు చేస్తూ తమ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా యూట్యూబ్లో వైరల్ అయితున్నది సెలబ్రిటీల హోమ్ టూర్ వీడియోలు.

ఇక ప్రస్తుతం నటి ప్రగతి కూడా తన హోమ్ టూర్ వీడియోని షేర్ చేసి ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఆ వీడియోలో తన ఇంటి గురించి ఎన్నో ఆసక్తి విషయాలను ఇంట్లోని వస్తువులతో తనకున్న అనుబంధాన్ని కూడా వివరించింది. అయితే ఇప్పటికైనా సొంత ఇంటిని నిర్మిస్తాననే ఉద్దేశంతో 16 ఏళ్ల క్రితమే నేమ్ ప్లేట్ కొన్నానని.. ఆ తర్వాత పదేళ్లకు తను కలగన్న ఇంటిని నిర్మించానని ప్రగతి ఆంటీ తెలిపింది.

సాధారణంగా ప్రజలు సెలబ్రిటీల హోమ్ అంటే బాగా రిచ్ గా ఉంటుందని అనుకుంటారు.. కానీ తన ఇల్లు మాత్రం సాదార‌ణ‌ మధ్యతరగతి వారి ఇల్లు ఎలా ఉంటుందో అలాగే నిర్మించుకున్నానని కూడా ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా డ్రీమ్ హౌస్ ను నిర్మించుకోవడం, తన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వడం, మంచి కెరీర్ ఏర్పాటు చేసుకోవడం ఇలా మూడు అద్భుతాలు ప్రగతి ఆంటీ జీవితంలో జరిగాయని కూడా చెప్పారు.

అయితే ప్రగతి ఆంటీకు ఫోటోలు దిగడం పెద్దగా నచ్చదని అందుకే తన హౌస్ లో ఫోటోలు తక్కువగా ఉంటాయని.. కానీ మొదటి మేకప్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చిన ఫోటో ఒక్కటే జ్ఞాపకంగా దాచుకున్నాను అని చెప్పుకోవచ్చింది. తన ఇంట్లో వస్తువులన్నీ అరుదైనవిగా ఉంటాయని.. పైగా తనకు బుద్ధుడు, సూర్యుడు అంటే చాలా ఇష్టమని.. ఆ కారణంగానే తన చేతి మీద సూర్యుడి టాటూ వేయించుకున్నానని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రగతి ఆంటీ హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.