Biggboss-6లో పెద్ద మలుపు… టాప్ లోకి ఉహించని కంటెస్టెంట్?

ఇప్పుడు బుల్లితెర షోస్ లో బాగా ప్రాచుర్యం పొందినది Biggbossషో అని వేరే చెప్పాల్సిన పనిలేదు. నేడు యువత టీవీలకు అతుక్కుపోయి మరీ ఈ షోని చుస్తున్నారేంటి అర్ధం చేసుకోండి. ఇకపోతే తాజాగా ఓరామ్యాక్స్ సంస్థ ఇటీవల డిజిటల్ సోషల్ మీడియా సర్వేల ద్వారా బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ లో ఉన్నవారి గురించి వెల్లడించింది. అయితే ఓట్ల వివరాలు ఓ రకంగా ఉంటే సోషల్ మీడియాలో వారి ర్యాంకింగ్ మరొక రకంగా ఉండటం ఇక్కడ విశేషం అని చెప్పుకోవాలి. నెంబర్ వన్ ప్లేస్ లో ఎవరు ఉన్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు?

బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి సింగర్ రేవంత్ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. దాంతో అందరి దృష్టి అతనిపైనే పడింది. అంతే కాకుండా ప్రతి వారం నామినేషన్స్ లో ఉన్నప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతూ బయటపడుతూ ఉండేవాడు. ఇక ఓటింగ్ లో కూడా రేవంత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. అయితే ఇపుడు తాజాగా ఓరామ్యాక్స్ నిర్వహించిన సర్వేలో కూడా సింగర్ రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు చాలా మంది సోషల్ మీడియా నుండి కూడా మద్దతు ఇవ్వడమే దీనికి కారణం.

ఇక ఆ తర్వాత అంటే రెండో ప్లేస్ లో వున్నది శ్రీహాన్. శ్రీహాన్ తన తెలివితేటలతో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు చాలా తెలివిగా ఆడుతూ వస్తున్నాడు. అలాగే ఒక పక్క సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున అతనికి మద్దతు ఇస్తోంది. ఇక గొడవలు అయినప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తన ఆట తాను ఆడుతున్నాడు. ఇక మూడో ర్యాంకులో ఈ కంటెస్టెంట్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆమె వుంది. ఆమె ఎవరంటే.. శ్రీ సత్య. అవును, ఈమెను అందరూ రెండో వారంలోనే ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈమె మూడో ప్లేస్ దక్కించుకుంది.ఇక నాలుగో ప్లేస్ లో జబర్దస్త్ ఫైమా వుంది.