ఇంట్రెస్టింగ్: ముద్దు, బెడ్ సీన్స్ లో నటించే ముందు.. హీరోయిన్లు అలా చేస్తారట..!!

సినిమా అంటే కేవలం లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాస్, ఏడుపు సన్నివేశాలు ..ఇవే కాదు కొంచెం శృంగారం కూడా కలిసి ఉండాలి. అప్పుడే అన్ని కలలు సమపాలనలో ఉన్న సినిమాగా ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో శృంగారాన్ని కూసింత ఎక్కువ స్థాయిలోనే ఉండేలా చూసుకుంటున్నారు మన దర్శక నిర్మాతలు . అయితే ఏ హీరో కైనా ఏ హీరోయిన్ కైనా ఇలాంటి సన్నివేశాలలో నటించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరో తెలియని అబ్బాయిని పట్టుకొని ముద్దు పెట్టుకోవాలన్నా.. బెడ్ పై పడుకోవాలన్నా.. కొంచెం అన్ కంఫర్ట్ గానే ఫీల్ అవుతారు. కొందరు ఇలాంటి వాటికి నో చెప్పి సినిమా నుంచి తప్పుకుంటారు . మరికొందరు డబ్బు కోసం దేనికైనా సిద్ధం అంటూ కళ్ళు మూసుకొని అన్ని పనులు కానిచ్చేస్తారు. అయితే ఇలా బెడ్ సీన్స్ చేసే ముందు హీరోయిన్స్ ఏం చేస్తారో తెలుసా…?

జనరల్ గా మన తెలుగు ఇండస్ట్రీలో ముద్దు సీన్స్ పెట్టుకునేటప్పుడు ..మధ్యలో బాల్ పెడతారు. అటుపక్క హీరో బాల్ ని ముద్దు పెట్టుకుంటునట్లు.. ఇటుపక్క హీరోయిన్ ముద్దు పెట్టుకుంటునట్లు ..సీన్ షూట్ చేసి.. ఆ తర్వాత ఎడిటింగ్ లో వాళ్లకు తగ్గ విధంగా మార్చుకుంటారు . 90% మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలానే చేస్తారు . అయితే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు ఏదైనా న్యాచురాలిటీ గానే ఉండాలి. ఓ అమ్మాయి అబ్బాయి నిజంగా ముద్దు పెట్టుకునే సీన్ ఉంది అంటే వాళ్ళు నిజంగానే ముద్దు పెట్టుకోవాలి. మధ్యలో బాల్, పిల్లో ఇలాంటివి పెట్టినా డైరెక్టర్ ఒప్పుకోరు. సో ఇలాంటి టైం లో బాలీవుడ్ హీరోయిన్స్ ఏం చేస్తారంటే .. రొమాంటిక్ సీన్స్ నటించే ముందు అలాంటి ఫీలింగ్స్ కలగకుండా ఉండేటందుకు టాబ్లెట్స్ వేసుకుంటారట.

ఇదివరకే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. “రామ్ లీలా” సినిమా షూటింగ్ టైంలో దీపిక పదుకొనే రణవీర్ సింగ్ ముద్దు పెట్టుకుంటున్న టైంలో వాళ్లు నిజంగానే టెంప్ట్ అయిపోయి ఘాటుగా లిప్ లాక్ ఇచ్చుకున్నారట . దీంతో డైరెక్టర్ షాక్ అయి కట్ చెప్పినా కానీ వాళ్లు ఆ ఫీలింగ్ లోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారట .ఇలాంటి ఫీలింగులు కంట్రోల్ చేసుకోవాలి అంటే కచ్చితంగా బెడ్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ చేసే ఒక గంట ముందు సినిమాలో ఆ సీన్లో నటించే అమ్మాయి, అబ్బాయి అలాంటి ఫీలింగ్స్ రాకుండా టాబ్లెట్ వేసుకుంటారట . అప్పుడు వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఏవి కలగవట.