మోకాలి నొప్పితో మెట్లు కూడా దిగ‌లేకపోయిన‌ ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం!

ఇటీవల జరిగిన `ఆదిపుష్` ట్రీజర్ ఈవెంట్లో ప్రభాస్ ని చూసిన డార్లింగ్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డార్లింగ్ కు ఏమైంది అంటూ ప్రభాస్ అభిమానులంతా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆదివారం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ ఓంరౌత్ , హీరోయిన్ కృతి సన‌న్‌ తో పాటు ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.

అయితే వీరు ముగ్గురు స్టేజ్ వ‌ద్ద‌కు వ‌స్తుండ‌గా.. ప్రభాస్ నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. మెట్లు కూడా దిగలేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు ఒకపక్క దర్శకుడు, మరోపక్క హీరోయిన్ కృతి సస‌న్‌ సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూశాక అభిమానుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

వాస్త‌వానికి చాలా రోజుల నుండి ప్రభాస్ మోకాలి సమస్యతో బాధపడుతున్నాడ‌న్న‌ విషయం తెలిసిందే. ప్రభాస్ దానికి సంబంధించిన సర్జరీ ఈ మధ్యనే చేయించుకున్నాడు. అయితే స‌ర్జ‌రీ అనంత‌రం ఎక్కువ రోజులు రెస్ట్‌ తీసుకోకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం జరుగుతుంది. మొన్నామ‌ధ్య‌ పెద్ద నాన్న కృష్ణంరాజు మరణంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినా.. వారం రోజుల తర్వాత మళ్లీ స‌లార్ షూటింగ్లో భాగం అయ్యాడు.

ఇక తాజాగా అయోధ్యలో జరిగిన ఈవెంట్ లో సైతం ప్రభాస్ పాల్గొన్నాడు. మోకాలి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నా.. ఆయ‌న ఆ నొప్పిని లోలోనే భ‌రిస్తూ ఈవెంట్‌లో ఎంతో హుషారుగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఒకానొక స‌మ‌యంలో మెట్లు కూడా దిగ‌లేక ఇబ్బంది ప‌డుతూ అంద‌రి కంటా ప‌డ్డాడు. ఇక అలా ప్ర‌భాస్‌ను చూశాక అభిమానులు ఎంత‌గానో వ‌ర్రీ అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కంప్లీట్ రెస్ట్ తీసుకుంటేనే మంచిద‌ని ప్ర‌భాస్‌కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.