టాప్ లేపుతున్న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ బిజినెస్.. డీటెయిల్స్ ఇవే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో అదిరిపోయే ఫామ్ లోకి వచ్చాడు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాటు ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.. వసుళ్ల పరంగా చూస్తే అఖండ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇంకా చెప్పాలంటే అటు వెండితెరపై అఖండ ఇటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాపై సిని వర్గాల్లోనూ ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్లో 107వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

Latest: NBK107 is officially titled Veera Simha Reddy | 123telugu.com

ఇప్పటికే వీరసింహారెడ్డి ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన శ్లోకా సంస్థ వీర సింహారెడ్డి ఓవర్సీస్ రైట్స్‌ను నాలుగు కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అంటే వీర సింహారెడ్డి ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రావాలంటే 1 మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక నైజం తో పాటు ఆంధ్రలోని పలు ఏరియాలోను ఈ సినిమాకు మంచి బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి.