యూట్యూబ్‌లో అవి చూసి నా వైఫ్‌తో చేస్తుంటా.. హీరో కార్తికేయ కామెంట్స్ వైర‌ల్‌!

హీరో కార్తికేయ.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన నటుడిగా మంచి స్థానాన్ని దక్కించుకున్నాడు. కార్తికేయ `ఆర్ఎక్స్ 100` సినిమాతో మంచి హిట్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఎత్తున వసూళ్లను రాబట్టాడు. ఒకపక్క హీరోగా నటిస్తూ మరో పక్క విలన్ పాత్రలలో కూడా నటిస్తూ మంచి మార్కులు కొట్టేశాడు. నాని `గ్యాంగ్ లీడర్` సినిమా అలాగే `వలిమై` సినిమాలో విలన్ గా చేసి మంచి ప్రశంసలను అందుకున్నాడు.

 

తాజాగా కార్తికేయ “గిస్మట్ అరబిక్“ అనే రెస్టారెంట్ ను ప్రారంభించడానికి వెళ్ళాడు. కార్తికేయ రెస్టారెంట్ ను ప్రారంభించి.. ఫోటోలకు ఇచ్చిన అనంతరం అనేక ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాకుండా రెస్టారెంట్లో అనేక రకాల పదార్థాలను టేస్ట్ చూసి ఎంజాయ్ చేశాడు. కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.. తను యూట్యూబ్లో అనేక వంటకాలను తన వైఫ్ తో కలిసి చూసి ప్రిపేర్ చేస్తాడట. అంతేకాకుండా తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కానీ రోజు డైట్ కోసం చికెన్ తినడంతో బోర్ కొడితే అప్పుడప్పుడు మటన్ తింటాడని పేర్కొన్నాడు.

అలా కార్తికేయ తన వైఫ్ తో కలిసి యూట్యూబ్ చూసి అప్పుడప్పుడు అనేక వెరైటీ వంటకాలను ట్రై చేస్తుంటామని కార్తికేయ మీడియాకు తెలిపాడు. ఇక అంతే కాకుండా తన సినిమాలకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

ప్రస్తుతం తాను `బెదురులంక 2012` అనే సినిమాలో నటిస్తున్నట్టు అలాగే యువీ క్రియేషన్స్‌లోను ఓ సినిమాను పూర్తి చేశానంటూ చెప్పుకొచ్చాడు. రెండు, మూడు నెలల్లో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను గతంలో చేసిన విలన్ రోల్స్ కు మంచి గుర్తింపు వచ్చిందని అలాగే రానున్న రోజుల్లో అలాంటి మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని కూడా చెప్పాడు.ఇక ప్రస్తుతం కార్తికేయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.