హీరోయిన్ కామ్నా జెట్మ‌లానీని ప్రేమ పేరుతో మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరో త‌మ్ముడు…!

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌స‌రం తీరేవ‌ర‌కూ ఎంతో ప్రేమ‌గా ఉండి ఆ త‌ర‌వాత దూరం పెట్టేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒక్క‌సారి అవ‌కాశాలు త‌గ్గాయంటే పట్టించునేవాళ్లు కూడా ఉండ‌రు. అంతే కాకుండా అవ‌కాశాల పేరుతో వాడుకునేవారు… ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు కూడా బోలేడు మంది ఉంటారు. ఇవ‌న్నీ క‌ల్పించుకుని చెప్పేవి కాదు. సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్లు సైతం సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ న‌మ్మిన‌వాళ్ల చేతిలోనే దారుణంగా మోస‌పోయారు. ఇదిలా ఉంటే గోపిచంద్ హీరోయిన్ కామ్మ జెట్మ‌లాని సైతం ఓ హీరో త‌మ్ముడి చేతులో దారుణంగా మోస‌పోయింద‌ట‌.

ప్రేమికులు సినిమాతో కామ్నా జ‌ట్మ‌లాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమాలో కామ్నా జ‌ట్మ‌లాని హీరోయిన్ గా నటించ‌గా… ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత కామ్నా జ‌ట్మ‌లాని క్రేజ్ కూడా ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా అనుకున్నమేర సక్సెస్ అవ్వలేకపోయింది.

ఆ త‌ర‌వాత‌ మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసింది. అయినప్పటికీ ఈ అమ్మ‌డికి బ్రేక్ రాలేదు. దాంతో మెల్లిమెల్లిగా కామ్నా జెట్మ‌లాని ఇండస్ట్రీకే దూరమైంది. అయితే సినిమాల‌లో రాణిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో తమ్ముడితో కామ్నా జ‌ట్మలాని ప్రేమాయణం నడిపించిందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ హీరో కామెడీ సినిమాల్లో నటించగా అతడి తమ్ముడు కూడా అనేక చిత్రాల్లో నటించాడట. చాలా కాలం పాటు కామ్నా జ‌ట్మ‌లాని హీరో తమ్ముడితో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిందని వార్తలు వినిపించేవి.

అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత స్టార్ హీరో తమ్ముడు పక్కచూపులు చూశాడని అతడికి దూరమైందని టాక్. అలా హీరో తమ్ముడు మోసం చేయడంతో కామ్నా జ‌ట్మ‌లాని మళ్లీ సినిమాల్లో నటించడానికి సైతం ఇష్టపడలేదట. అలా ఇండస్ట్రీకి దూరమైన కామ్నా జ‌ట్మ‌లాని ఆ తర్వాత ఓ వ్యక్తిని వివాహం చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యింది.

Share post:

Latest