కొంప ముంచేసిన తమన్నా .. తిక్క రేగి సినిమా నుండి తీసేసిన స్టార్ డైరెక్టర్..!?

యస్.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రెస్టీహీయస్ ప్రాజెక్ట్ భోళా శంకర్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. హ్యాపీ డేస్ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంటరైన తమన్నా.. ఆ తరువాత తనదైన స్టైల్ లో నటిస్తూ అంద చందాలతో అలరిస్తూ కోట్లాదిమంది ప్రజలను ఫాన్స్ గా మార్చుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తమన్న.. బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి శభాష్ అని అనిపించుకుంది.

అంతేకాదు హ్యూజ్ రెమ్యూనరేషన్ అందుకుంటూ ఓ పక్క సోషల్ మీడియాలో మరో పక్క పలు రకాల యాడ్స్ ని ప్రమోట్ చేస్తూ రెండు చేతులారా కోట్ల ఆస్తిని సంపాదించుకుంది. ఈ మధ్యనే తమన్నా దగ్గర వజ్రాల మూట కూడా ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే రీసెంట్ గా తమన్న చేసిన మితిమీరిన కామెంట్స్ కారణంగా డైరెక్టర్ ఆమెను సినిమా నుండి తీసేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారాయి.

మనకు తెలిసిందే.. తమన్నా ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా నటిస్తుంది . కాగా రీసెంట్ గా డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి వేరొక డైరెక్టర్ దగ్గర తప్పుగా మాట్లాడిన తమన్నా ఆ కామెంట్స్ బయటకు రావడంతో మెహర్ రమేష్ కోపంతో తమన్నాను సినిమా నుండి తీసేసిన్నట్లు సమాచారం. అంతేకాదు నీ కన్నా వేరే మంచి హీరోయిన్ ని పెట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా తీస్తాను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడట . దీంతో తమన్నా కోపం వచ్చి మెగాస్టార్ అని కూడా చూడకుండా సినిమా నుంచి తప్పకున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. మరి చూడాలి ఒకవేళ ఈ సినిమా నుండి తమన్నా తప్పుకుంటే అలాంటి పాత్రలో ఏ హీరోయిన్ ని సెలక్ట్ చేస్తారో ఈ మెహర్ రమేష్..?

Share post:

Latest