హవ్వ… ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ అడిగిన అభిమాని… రష్మిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

రష్మిక మందన్న.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బిగ్గెస్ట్ సినిమా ఆఫర్లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్నా.. ఇప్పుడు తను నటించబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండే లాగానే చూసుకుంటుంది. అంతేకాదు ఈ నేషనల్ బ్యూటీ ఏ సినిమా చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుండడం విశేషం.

మనకు తెలిసిందే.. రష్మిక మందన్న టాలీవుడ్ ,కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా రికార్డ్ నెలకొల్పింది. కాగా ఈ క్రమంలోనే రష్మిక మందన్నా బాలీవుడ్ లో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.


కాగా రీసెంట్ గా గుడ్ బై సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందనకు షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. రష్మిక అభిమాని అంటూ చెబుతూ ఓ కుర్రాడు తన దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇవ్వమన్నాడు .దీంతో రష్మిక మందన ఆటోగ్రాఫ్ ఎక్కడ ఇవ్వాలి అంటూ ప్రశ్నించగా ..అతగాడు ఏకంగా తన చాతిపై ఇవ్వమన్నాడు. ఈ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారు షాక్ అయ్యారు . అయితే రష్మిక మందన్నా తన పరిస్థితి అర్థం చేసుకొని.. అతని టీ షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.