మహేష్ కు మరదలు పిల్ల దొరికిపోయిందోచ్… బావ మరదలు సరసాలు అదిరిపోవాల్సిందే..!?

హమ్మయ్య.. మహేష్ బాబుకు మరదలు పిల్ల దొరికిపోయిందా.. ఇక సేఫ్.. ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో.. ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలి అంటే అదృష్టం తో పాటు హైట్, దానికి తగ్గ అందం ఉండాలి.. లేకపోతే మహేష్ బాబు పక్కన కంటికి కనిపించరు . అందుకే కాబోలు మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించే డైరెక్టర్స్ అందరూ హీరోయిన్స్ విషయాల్లో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారు.

ప్రజెంట్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో శ్శంభ్28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కాగా ఈ సినిమాలో మహేష్ మరదలుగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని ..దానికోసం బోలెడు మంది హీరోయిన్స్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అప్రోచ్ అయ్యారని.. కానీ ఆయన అనుకున్న క్వాలిటీ కలిగిన అమ్మాయి ఇప్పటివరకు దొరకలేదని సమాచారం. కాగా రీసెంట్ గా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అనుకున్న క్వాలిటీస్ కలిగిన అమ్మాయి దొరికిందట.

ఆమె మరెవరో కాదు జాతి రత్నాలు సినిమాతో ఫస్ట్ సినిమాని బ్లాక్ పోస్టర్ హిట్గా తన ఖాతాలో వేసుకున్న తెలుగు బ్యూటీ ఫరియా అబ్దుల్లా. అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకొని.. ఆ తర్వాత చిన్నాచితకా పాత్రల్లో కనిపిస్తూ ..రీసెంట్గా బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ తో అందరిని అలరించిన ఫరియా అబ్దుల్లా మహేష్ బాబు మరదలుగా ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మహేష్ హైట్ కి ఫరియా అబ్దుల్లా హైట్ కి ఇద్దరు జోడి కి ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే ..సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందే ..అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.