వావ్..తారక్ కోసం కత్తిలాంటి ఫిగర్ ..కొరటాల లెక్క భలే ఉందే…?

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఎన్టీఆర్. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోనున్నారు. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం ఒక విశేషం.

అయితే ఈ సినిమాల్లో తారక్ మాస్ లుక్ లో కనువిందు చేయబోతున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ చెప్పిన కథ తారక్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. అందుకే షూటింగ్ ఇంత లేట్ అవుతున్నా కానీ హీరోయిన్ ఇంకా ఫిక్స్ చేయకపోయినా కానీ ఎన్టీఆర్ బ్యాక్ స్టెప్ వేయకుండా కొరటాల సినిమాకి కమిట్ అయి ఓపిక పడుతూ టైం ఇస్తున్నారట. అంత నచ్చేసిందట కొరటాల స్టోరీ లైన్
తారక్ కి. అయితే ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దు అనుకున్న కొరటాలకు తీవ్ర నిరాశ ఎదురైంది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30 సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని కశితో కొరటాల ప్రతి పాయింట్ ని.. ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారట.

అందుకే హీరోయిన్ విషయంలో ఎక్కువ టైం తీసుకుని ఏ హీరోయిన్ అయితే తారక్ పక్కన నటించగలదు.. ఆ జంటను ఫ్రెష్ లుక్కులో ప్రజెంట్ చేయగలము అంటూ ఆలోచిస్తున్నారట . ఈ క్రమంలోనే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది . మొదట హీరోయిన్ గా ప్రభాస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని అనుకుంటుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీ కోసం రీసెంట్ గా సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్ ని ఫిక్స్ చేశాడట కొరటాల. సీతారామం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ..”మీకు ఇష్టమైన హీరో ఎవరు “అని అడగ్గా.. సెకండ్ కూడా ఆలోచించుకోకుండా టక్కున ఎన్టీఆర్ పేరు చెప్పుకొచ్చింది మృణాల్. ఈ క్రమంలోనే అమ్మడుకు ఇలాంటి ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి తెరపై తారక్ మృణాల్ ఠాకూర్ రొమాన్స్ ఎంతవరకు జనాలను మెప్పిస్తుందో ..ఒకవేళ ఇదే నిజమైతే కచ్చితంగా మృణాల్ ఠాకూర్ ఖాతాలో రెండో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.!!