పుష్ప -2 కోసం కాజల్ ని దింపుతున్న సుకుమార్ .. ఒప్పుకుంటుందా..?

డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అభిమానుల అంచనాలను ఏమాత్రం వెనకడుగు వేయకుండా పుష్ప -2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇక ఇందులో హీరోయిన్గా రష్మిక నటించింది. కీలకమైన పాత్రలో అనసూయ సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటించారు. ఇక స్పెషల్ సాంగ్ లో సమంత నటించడం వల్ల ఈ సినిమాకు మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు.

Trending South News Today: Allu Arjun's Pushpa sails past 150-crore mark at  BO, Kajal Aggarwal's latest picture sparks pregnancy rumours and more
ఇదివరకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత.. ఈ సాంగ్ తో మరింత పాపులర్ అయిపోయింది. ఇదంతా ఇలా ఉండగా పుష్ప -2 కోసం సుకుమార్ ఇదే రేంజ్ లో ఉండే విధంగా ఒక స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక కాజల్ కూడా గతంలో కూడా ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది.

అయితే ఇప్పుడు కాజల్ కు వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు.ఈ సమయంలో కాజల్ ఇలాంటి పని చేస్తుందా లేదా అన్నదే అందరి సందేహం.అయితే కాజల్ తన కం బ్యాక్ ఒక రేంజ్ లో ఉండాలని ఈ సాంగ్ ఆఫర్ ఓకే చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా అల్లు అర్జున్ తో కలిసి ఆర్య -2 లో నటించింది మళ్ళీ ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు సిద్ధమైంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిత్ర బృందం ఈ విషయంపై విధంగా స్పందిస్తుందో చూడాలి.