ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కధ పై మోజు పడ్డ చరణ్..అభిమానుల రియాక్షన్ ఇదే..!?

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్. వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. ఆ సినిమాలోని తన నటనకు గాని ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ త‌న‌ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తీస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమర్‌కు రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత చేసే సినిమాలు గురించి కూడా రామ్ చరణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు.ఇదే క్రమంలో రామ్ చరణ్ తర్వాత సినిమాలు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఒక కన్నడ దర్శకుడు చెప్పిన కథను విని అతనితో సినిమా చేస్తానని చెప్పాడట.అతను ఎవరో ఇప్పుడు చూద్దాం కన్నడ డైరెక్టర్ నర్తన్.. రామ్ చరణ్ కు ఈ మధ్య ఒక కథ చెప్పాడట. ఆ కథ రామ్ చరణ్ కి బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

Ram Charan congratulates KGF 2 team for blockbuster records; calls Yash's  performance 'mind blowing' | Celebrities News – India TV

ఈ కథ గురించి ఒక వార్త బయటకు వచ్చింది కే జి ఎఫ్ సినిమాలతో భారీ క్రేజ్‌ని దక్కించుకున్న కన్నడ స్టార్ హీరో యాష్ కి కూడా నర్తన్‌ ఈ కథ చెప్పాడట. యాష్ కి ఈ కథ నచ్చకపోవడంతో అతను రిజెక్ట్ చేశాడట. అదే కథను నర్తన్‌ రామ్ చరణ్ కి చెప్పాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కన్నడలో మస్తీ సినిమాతో నర్తన్‌ మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కాగ ఈఇద్దరి కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి. ఇది అంతవరకు నిజమో తెలియదు అధికార ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest