రాఖీ భాయ్ లో మంచి తండ్రి వున్నాడు… తన పాపతో చూడండి ఎలా ఆడుకుంటున్నాడో!

KGF సినిమాని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్రని కూడా మర్చిపోలేరు. ఆ పాత్రలో నటించి మెప్పించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ వరుసలో చేరిపోయాడు. దాంతో యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా KGF 2 విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు యశ్ తదుపరి సినిమా పట్టాలెక్కలేదు. అసలు ఆయన ఏ కథకైనా ఓకే చెప్పాడా లేదా అన్న విషయం కూడా తెలియదు. ఈ విషయంలో యాష్ అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి కేజీఎఫ్ 2 హ్యాంగోవర్ లోనే యశ్ ఉన్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ యశ్ తదుపరి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటే.. ఆయన మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. యశ్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా తన ఫ్యామిలీ మెంబర్స్ తో టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్న క్యూట్ వీడియోలను షేర్ చేస్తున్నాడు.

తాజాగా తన కూతురు తో ఆడుకుంటున్న ఈ క్యూట్ వీడియోను షేర్ చేసిన యశ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పిల్లలతో సమయం గడుపుతున్న యశ్ సినిమాలు చేసేది ఎప్పుడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు కొంతమంది మాత్రం యాష్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఓ తండ్రిలాగా యాష్ బాధ్యతలు వహించడంతో నిజంగా సూపర్ అంటూ కీర్తిస్తున్నారు. కాగా కేజీఎఫ్ 2 సినిమాను చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కానీ యశ్ మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాలకు ఎందుకు కమిట్ అవ్వలేదు అని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.