కత్తిలాంటి ఆ ఫిగర్ కోసం..కారులో కొరటాల వెయిటింగ్.. !?

డైరెక్టర్ కొరటాల శివ అపజయం అంటే ఏంటో తెలియని ఫుల్ ఫామ్ తో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న డైరెక్టర్ అని ఒకప్పుడు అనేవారు జనాలు. పాపం అందుకే కాబోలు అందరూ కొరటాలకు ఫ్లాప్ పడలేదు అంటూ లైఫ్ లాంగ్ సరిపడా ఫ్లాప్ మూవీని రీసెంట్ గా తన ఖాతాలో వేసుకున్నాడు ఆచార్య సినిమాతో కొరటాల శివ. మనకు తెలిసిందే మెగా హీరోస్ ఇద్దరిని పెట్టి ఆచార్య అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమా కథను రాసుకోచ్చాను అంటూ మాటలు చెప్పి తీరా అట్టర్ ఫ్లాప్ సినిమాను మెగా హీరోస్ ఖాతాలో వేశాడు ఈ డైరెక్టర్.

అంతకుముందు కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమాలు చూసిన జనాలు.. ఆచార్య సినిమా చూసిన జనాలకు ఒకటే డౌట్ వచ్చింది. అసలు ఈ సినిమాను డైరెక్టర్ చేసింది కొరటాల శివ నేనా..? లేదా ముందు సినిమాను డైరెక్టర్ చేసింది కొరటాల శివ నేనా ..?ఆ సినిమాల్లో అంత బాగా స్క్రీన్ స్పేస్ విజువలైజేషన్ ఇచ్చిన డైరెక్టర్ ..ఆచార్య విషయంలో ఎందుకు తప్పు చేశాడు . ఎందుకు ప్లాపును తన ఖాతాలో వేసుకున్నాడు. పరమ చెత్త సినిమా తీశారు” అంటూ సినీ ప్రముఖులు సైతం కొరటాల శివను పాయింట్ అవుట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత ఎందుకు రీసెంట్ గా ఓ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ.. పరోక్షంగా తప్పంతా కొరటాల శివాదే అంటూ ప్లాప్ ను మొత్తం తన మీదకు నెట్టేసాడు.

కాగా ఇలాంటి ట్రోలింగ్ బాధల నుంచి కొరటాల శివ తప్పించుకోవాలంటే తాను నెక్స్ట్ చేస్తున్న సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలి . మనకు తెలిసిందే ఎన్టీఆర్ తో కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద తలనొప్పి వస్తున్నాయి.

NTR 30 To Get More Delay
NTR 30 To Get More Delay

మొన్నటి వరకు జాన్వీ కపూర్ అనుకున్నారు ..ఆ తర్వాత ఆలియా భట్ అనుకున్నారు ..ఆ తర్వాత రష్మిక మందన అనుకున్నారు ..చివరికి పూజా హెగ్డే పేరు కూడా వినపడింది ..కానీ వీళ్ళందరూ కాకుండా తెరపైకి ఇప్పుడు కొత్త బ్యూటి పేరు వినిపిస్తుంది. ఎస్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ఓ కత్తిలాంటి బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నారట. ఈ క్రమంలోనే ఆయన ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ ఇంటి బయట కారులో వెయిట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి చూడాలి ఆ కత్తిలాంటి ఫిగర్ ఎవ్వరో..?

Share post:

Latest