తొలిప్రేమ నటి కీర్తిరెడ్డి సోదరుడు కూడా హీరోనే అని తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు ఇక హీరోయిన్గా కీర్తి రెడ్డి తన అందచందాలతో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అయితే అనుకున్నంత స్థాయిలో ఇమే కెరియర్ రాణించలేక పోయింది.. ఇక మహేష్ బాబుతో రెండు సినిమాలలో నటించిన అంతగా కలిసి రాలేదు. దీంతో అక్కినేని సుమంత్ ని వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు.

Abhishek Bachchan's former co-star Keerthi Reddy and ex-husband Sumanth  come under same roof after many years of divorce
ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు రాలేకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్ళింది. అక్కడ కూడా కేవలం రెండు మూడు సినిమాలు తీసి మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక ఎన్నారై ని వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక విషయం ఏమిటంటే . కీర్తి రెడ్డి సోదరుడు కూడా సినిమాలలో హీరోగా నటించినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

Actress Keerthi Reddy brother Samrat, Keerthi Reddy,Hero Sumanth, Samrat,  Bigg Boss Show - Telugu Tholi Prema, Samrat, Actresskeerthi, Bigg Boss,  Bigg Boss Show, Sumanth, Keerthi Reddy
కీర్తి రెడ్డి సోదరుడు కేవలం హీరోగా నటించారనే విషయం పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఇక ఈమె సోదరుడు పేరు సామ్రాట్. ఈ హీరో నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ సక్సెస్ కాలేదు కేవలం అల్లరి నరేష్ తో కలిసి ఆహనా పెళ్ళంట సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో కూడా సామ్రాట్ పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు ఈ నటుడు.