బిగ్ షాకింగ్: ఆ సీనియర్ బ్యూటీని శ్రీను వైట్ల రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు అనే పదం చాలా కామన్ గా వినిపిస్తుంది. ఒకప్పుడు లవ్ , ఎఫైర్ అంటూ ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేసే మన హీరో హీరోయిన్లు.. ఇప్పుడు పెళ్లి బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. చాలామంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని బిడ్డలని కూడా కనేసిన తర్వాత తమ పార్ట్నర్ తో తమకు ప్రాబ్లమ్స్ రావడం వల్ల.. మనస్పర్ధలు ఏర్పడడం వల్ల విడాకులు ఇచ్చి తమ పవిత్రమైన బంధాన్ని తెంచేసుకుంటున్నారు . ఇప్పటికే ఇలా బోలెడు మంది హీరోస్ హీరోయిన్స్ విడాకులు తీసుకున్నారు .

కాగా ఆ లిస్టులోకే యాడ్ అవుతున్నాడు శ్రీను వైట్ల అంటూ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు ఆయన రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఆయన టైం బాగోలేక కథలు సెట్ అవ్వక హీరోల అవకాశాలు ఇవ్వట్లేదు ..కానీ ,ఒకసారి ఆయన గత తాలూకా ట్రాక్ రికార్డు చూస్తే ఆయన ఎలాంటి హిట్స్ ఇండస్ట్రీకి ఇచ్చారో మనకు అర్థమవుతుంది . గతంలో స్టార్ హీరోస్ అందరూ ఆయనతో సినిమాలు చేసేదానికి రెడీగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే.

అయితే శ్రీను వైట్ల సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఫెయిల్ అయిన్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య రూప ఆయన నుండి విడాకులు కోరుకుంటున్నట్లు ఈ క్రమంలోనే ఆమె కోర్టు వరకు వెళ్లిన్నత్లు సినీ వర్గాలలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. రూపాను శ్రీనువైట్ల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . వీరికి ముగ్గురు అమ్మాయిలు .అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్నా ఈ జంట మధ్య గత కొన్నేళ్లుగా ఏవో విభేదాలు నడుస్తున్నాయట. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు శ్రీను వైట్ల రూపాకు విడాకులు ఇచ్చిన వెంటనే ఆయన డైరెక్షన్లో పనిచేసిన ఓ సీనియర్ హీరోయిన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది .అంతేకాదు శ్రీను వైట్లకు ఆమెతో ఉన్న అఫైర్ కారణంగానే రూప విడాకులు ఇవ్వబోతుంది అంటూ కొందరు సినీ పెద్దలు చెప్పుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అటు రూపా కాని ఇటు శ్రీను వైట్ల కాని అఫీషియల్ గా స్పందించలేదు . ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటల లిస్టులు ఎక్కువైపోతున్నాయి. కోరుకుందాం ఈ జంట అయిన విడాకులు తీసుకోకుండా సవ్యంగా కాపురం చేసుకోవాలని..!!

 

Share post:

Latest