చిరంజీవి అసలు స్టార్ హీరోనే కాదు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో మంచి క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలు లేక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్లు అప్పుడప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు గీతాకృష్ణ. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు చిరంజీవి అసలు స్టార్ హీరోనే కాదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . ఇక దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Director Geeta Krishna: సుహాసినిని, చిరంజీవిని స్క్రీన్‌పైన చూడలేకపోయారు..  కమల్ హాసన్ 100% బెస్ట్... డైరెక్టర్ గీథా కృష్ణ..! | Telugu Rajyamఇకపోతే 2013లో ఒక తమిళ్ చిత్రానికి దర్శకత్వం వహించి డిజాస్టర్ కావడంతో సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈయన మెగాస్టార్ చిరంజీవి, చంద్రమోహన్ ల గురించి హాట్ కామెంట్లు చేశారు. ఇకపోతే కొన్ని పాత్రలకు కొందరు మాత్రమే సూట్ అవుతారని , అయితే అలా సూట్ కాని వారిని ప్రేక్షకులు ఆ పాత్రలో చూడలేరు అని కూడా తెలిపాడు. Director Geetha Krishna : చిరంజీవి పెద్ద స్టార్ కాదు.. కమల్ హాసన్  చేసినదాంట్లో 10 శాతం కూడా ఆయన చేయలేదు : గీతా కృష్ణఇకపోతే కమలహాసన్ తమిళ సినిమా రీమేక్ తెలుగులో చంద్రమోహన్ , శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాలో చంద్రమోహన్ నటనను అనవసరంగా పొగిడారు అంటూ కూడా తెలిపాడు. ఇకపోతే చిరు ఇంకా పెద్ద స్టార్ హీరో కాదు అయినా చిరంజీవి అంటే డాన్స్ , ఫైట్ అనే భావనలో ఉన్న ప్రేక్షకులకు మంచు పల్లకి సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు అని తెలిపాడు.Chandramohan dismisses rumours about his ill health, releases video |  Entertainment News,The Indian Express

ఇకపోతే ఆపద్బాంధవుడు సినిమా కూడా చిరంజీవి ఇమేజ్ కి దూరంగా ఉండే సినిమా అందుకే పెద్దగా సక్సెస్ అవ్వలేదు అని కూడా తెలిపాడు. ప్రస్తుతం గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు అసంతృప్తిని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా 1987 సంవత్సరములో గీతాకృష్ణ సంకీర్తన అనే సినిమా ద్వారా తన కెరియర్ ను ఆరంభించి ఆ సినిమాకు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

Share post:

Latest